బాదితులకు కోటి పరిహరం ఇవ్వాలని అందోళన

అందోళన. చేపట్టిన బాదిత‌ కుటుంబాలు

.ఖమ్మం
.ఎంపీ నామ నాగేశ్వరరావు పై చీమలపాడు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..తమ గ్రామంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేసి బానాసంచా కాలుస్తూ ర్యాలీగా వచ్చి ప్రమాదం కారణమైంది గాక తమకు సంబంధం లేదని ఎలా చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…బానా సంచా కాల్చింది వారు కాదా అని గ్రామస్థులు ఫైర్ అవుతున్నారు..భారీ పేలుడుతో శబ్దం రావడంతో ఒక్కసారిగా అంత ఉలిక్కిపడి భయాందోళనకు గురయ్యామన్నారు ..పేలుడు దాటికి ఆరుగురికి పైగా కాళ్లు పూర్తిగా విరిగిపోయాయని ఘటన స్థలంలో ఒక భయానక వాతావరణం ఏర్పడిందన్నారు..ఆత్మీయ సమ్మేళన సభకు 100 మీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగిందంటున్నారు..
వెంటనే ప్రమాదానికి కారకులైన వారిపై కేసులు నమోదు చేయాలని చీమలపాడు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు..
మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని లేనిపక్షంలో తమ గ్రామస్తులంతా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామంటున్నారు..బాదితులకు కోటి రుపాయల పరిహరం ఇవ్వాలని డిమాండ్ చేశారు..లేదంటే అందోళన చేస్తామని‌ హెచ్చారిస్తున్నారు

Leave A Reply

Your email address will not be published.