బిఅర్ ఎస్ నాయకుని దూషణ. తట్టుకోలేక ఉద్యోగి అత్మహత్య యత్నం
దేవదాయ ఉద్యోగి సమత అత్మహత్య యత్నం

……ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండల ,బిఅర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు తనను అకారణంగా దూషించాడని దేవాదాయ శాఖ ఉద్యోగిని సమత ఆత్మహత్య యత్నం చేసింది.అది గమనించిన తోటి ఉద్యోగులు ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.రూరల్ మండలం రెడ్డిపల్లి వద్ద ఉన్న మారెమ్మ గుడి దేవాలయానికి నూతన కమిటీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. తనకు సమాచారం ఇవ్వకుండా ఎందుకు నోటీసులు జారీ చేసారని బిఅర్ ఎస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సమత కు ఫోన్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడాడు. దీంతో అవమాన భారం భరించలేక సమత దేవాదాయ శాఖ కార్యాలయంలో నే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఇది గమనించిన తోటి ఉద్యోగులు చికిత్స నిమిత్తం ఖమ్మం నగరంలో ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.