యుద్దభూమిగా మారిన పాండవపూర్
అటవీ చెక్ పోస్ట్ వద్ద ప్రమాదంతొ రెచ్చిపోయిన గ్రామస్తులు

ప్రజల అగ్రహం కట్టలు తెంచుకున్నది… మనుషుల ప్రాణాలు మింగుతున్నా చెక్ పోస్ట్ ను గ్రామస్తులు బద్దలు చేశారు.. పర్నిచర్ ను ప్రజలకోపాగ్ని జ్వాల్లో మాడి మసైంది.. అటవీ పోస్ట్ ను తరలించేదాకా యుద్దం అగదంటున్నారు.. నిర్మల్ జిల్లాలో నిప్పురాజేసిన. అటవీ చెక్ పోస్ట్ పై ప్రత్యేక కథనం
… నిర్మల్ జిల్లా కడెం మండల పాండవపూర్ గ్రామంలో అటవీ శాఖ చెక్ వద్ద తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది.. చెక్ పోస్ట్ వద్ద. అగి ఉన్నా టిప్పర్ ను ద్విచక్ర వాహనదారుడు వెనుక నుండి డీకోట్టారు…ఆ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు రైతు మల్లేష్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు..
మల్లేష్ ప్రాణాలు కోల్పోవడానికి చెక్ పోస్ట్ కారణమని గ్రామస్థులు రెచ్చిపోయారు… గ్రామస్థులు దండులా కదిలి వచ్చారు.. చెక్ పోస్ట్ కర్రలతో విద్వంసానికి దిగారు..చెక్ పోస్ట్ లో ఉన్నా పర్నిచర్ ను రోడ్డు పై వేసి మంటల్లో తగులబెట్టారు…ఈ సందర్భంగా ప్రజలు అగ్రహంతో ఊగిపోయారు
. చెక్ పోస్ట్ తమ. పాలిట. రాకాసి గా మారిందంటున్నారుగ్రామస్తులు.. ఇప్పుడు మల్లేష్ .. అంతకుముందు ఇద్దరు చెక్ పోస్ట్ వద్ద. ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.. ప్రాణాలు మింగుతున్నా చెక్ పోస్ట్ ను తరలించాలని గ్రామస్తులు అందోళన చెపట్టారు… తరలించేంత వరకు పోరాటం అగదని గ్రామస్థులు అటవీ అదికారులను హెచ్చారించారు..
.. గ్రామస్థుల అందోళన తీవ్రమైన. భయంకరమైన వాతావరణం నెలకోంది.. దాడులతో యుద్దం వాతావరణం ఏర్పడింది..గ్రామంలో అల్లర్లు కట్టడి పోలీసులను బారీగా తరలించారు… మిగితా ప్రాంతాలను అల్లర్లతో అట్టుడుకుతున్నా పాండవపూర్ కు పోలీసులను తరలించడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.. అందోళన ముదరకుండా పికేటింగ్ ఏర్పాటు చేశారు పోలీసులు.సమస్యను పరిష్కరిస్తామని గ్రామస్థులకు పోలీసులు నచ్చజెప్పుతున్నారు…. గ్రామస్థులు మాత్రం చెక్ పోస్ట్ తరలించేదాక పోరాటం అగదని హెచ్చరికలు జారీ చేశారు