సీఎం కేసీఅర్, కేటీఅర్ రాజీనామా చేయాలి .బండి సంజయ్

పాత బస్తీలో సర్టిపికేట్ల కుంబకోణం పై విచారణ చేయాలి..బిజెపి

. హైదరాబాద్ స్లీనర్ సెల్స్ కు, ఉగ్రవాదులకు అడ్డాగా మారిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. దేశంలో ఎక్కడేం జరిగినా ఆ మూలాలు హైదరాబాద్ కు లింక్ ఉంటాయన్నారు. నిజామాబాద్ మోర్తాడ్ మండలం వాద్యాట్ లో పర్యటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. కాలికి గాయమై బాధపడుతున్న హంపీ పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతిని పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సంజయ్… సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాతబస్తీని ఎంఐఎంకు ధారాదత్తం చేశాడన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆధారాల్లేకుండా 27 వేలకు పైగా బర్త్ సర్టిఫికెట్లు, 4 వేలకు పైగా డెత్ సర్టిఫికెట్లు జారీ చేస్తే మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఏం చేస్తుండని ప్రశ్నించారు. నకిలీ బర్త్ సర్టిఫికెట్లతో హైదరాబాద్ లో ఉగ్రవాదులు పాగా వేస్తుంటే కేటీఆర్ ఎందుకు సమీక్ష చేయలేదని నిలదీశారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ కోరాలన్న సంజయ్.. అల్లర్లు సృష్టించి కేంద్రాన్ని బద్నాం చేసేందుకే బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి కుట్రకు తెరలేపుతున్నై అని ఆరోపించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రకు ప్లాన్ జరుగుతోందన్న ఆయన.. అదే సామాన్యుడికి ఓ సర్టిఫికెట్ కావాలంటే నానా యాతన పడాల్సి వస్తోందని.. కానీ పాతబస్తీలో మాత్రం వేల సంఖ్యలో సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయన్నారు. మీసేవ కేంద్రాలన్నీ ఎంఐఎం అనుచరులకప్పజెప్పారని… ఏ సర్టిఫికెట్ కావాలంటే అది జారీ చేస్తున్నారని ఆరోపించారు.ఈ విషయాన్ని ఇంతటితో వదిలే ప్రసక్తే లేదన్న సంజయ్.. కేసీఆర్, కేటీఆర్ వెంటనే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.