బండి సంజయ్ పోన్ ఎక్కడ ఉంది?

పోన్ పోయిందని పోలీసులకు పిర్యాదు చేసింజయ్

  • కరీంనగర్

    బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తన మొబైల్ ఫోన్ పోయిందని దానిని వెతికి పెట్టివ్వాలని కోరుతూ కరీంనగర్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం సాయంత్రం ఫిర్యాదు కాపీని మెయిల్ చేశారు. ఈ నెల 4వ అర్థరాత్రి నుండి 5వ తేది తెల్లవారే సమయంలో తనను క్రైం నెంబర్ 147/2023లో అరెస్ట్ చేసిన పోలీసులు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బొమ్మలరామారాం స్టేషన్ కు తీసుకెళ్లారని వివరించారు. ఈ క్రమంలో 7680006600 అనే నెంబర్ మొబైల్ ను తాను వినియోగిస్తున్నానని, ఇట్టి మొబైల్ ఫోన్ పోయిందని ఈ విషయం బొమ్మల రామారం తరలిస్తుండగా పోలీసు వాహనంలో ఉన్న అధికారులకు కూడా తెలియజేశానని సంజయ్ తెలిపారు. ఆ తరువాత కమలాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదయిన 60/2023 క్రైం నెంబర్ లో అరెస్ట్ చేసినప్పుడు కూడా తాను అడ్వకేట్లకు ఫోన్ పోయిందని చెప్పానని ఫిర్యాదులో వెల్లడించారు

  • ఈ విషయాన్ని న్యాయవాదులు కూడా బెయిల్ కోసం ఆర్గ్యూమెంట్స్ చేసినప్పుడు కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లారని, తనను కరీంనగర్ లో కస్టడిలోకి తీసుకున్నప్పుడు మొబైల్ ఫోన్ నాతో పాటే ఉందని బండి సంజయ్ వివరించారు. తన మొబైల్ ఫోన్ ను ట్రేస్ చేసి వెతికి పెట్టాలని అందులో పలువురి కాంటాక్ట్ నెంబర్లతో పాటు ముఖ్యమైన సమాచారం ఉన్నందున మొబైల్ ను వెతికిపెట్టి ఇవ్వాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.