బలగం గాయకుడు మొగిలి ఆరోగ్య పరిస్థితి విషమం
వైద్యం కోసం దాతలు అదుకోవాలని కోరుతున్నా ఆయన భార్య

వరంగల్ జిల్లా
బలగం సినిమా గాయకుడు మొగిలి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది.కిడ్నీ సంబంధిత వ్యాధితో వరంగల్ లోని సంరక్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు మొగిలి.. ఆయకు డయాలసిస్ చేస్తుండగా గుండెపోటు వచ్చింది .ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు.బలగం సినిమాలో క్లైమాక్స్ పాటతో కోట్లాది మంది హృదయాలను కదిలించారు మొగిలి – కొమురమ్మ దంపతులు.ఈ సందర్భంగా మొగిలి వైద్యం అర్థికంగా సహయం అందించాలని ఆయన భార్య కోమురమ్మ దాతలను కోరుతున్నారు