భద్రాచలంలో రాములోరి కళ్యాణం

భక్తుల కోసం బారీ ఏర్పాట్లు చేసిన అదికారులు

..భద్రాచలం పరమ పావన గోదావరి తీరాన ఉన్న పుణ్య క్షేత్రం.. ఏక పత్నీవ్రతుడిగా ఆదర్శ దాంపత్య జీవన విలువలను ప్రపంచానికి చాటి చెప్పిన దివ్యక్షేత్రం భద్రాచలం..లోకనాయకుడు రామ చంద్రుడు జగన్మాత సీతమ్మవారు కొలువై ఉన్న దివ్య క్షేత్రం భద్రాచలం. ఉత్తరాది రామజన్మభూమి అయోధ్య ఎంత ప్రాముఖ్యమైందో దక్షిణాది భద్రాచ లం దివ్య క్షేత్రం అంతే ప్రాశస్తమైనంది… దక్షిణ అయోధ్యగా పేరోందిన భద్రాచలం పుణ్య క్షేత్రాల్లో ప్రశస్థ మైనదిగా ఖ్యాతికెక్కింది.. వైకుంఠ నారాయణుడు కొలువైన భద్రగిరికి మరో పేరు దక్షిణ సాకేత పురి అంటారు. దక్షిణ భారత దేశంలోనే ప్రముఖ పుణ్య క్షేత్రంగా భాషిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామిదేవ స్థానం విశిష్టతపై బ్రహ్మోత్సవాల సందర్బం ప్రత్యేక కథనం ..

..అదిగో అల్లదిగో భద్రాచల దివ్య క్షేత్రం చూస్తున్నారుగా…భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి 40 కిలో మీటర్ల దూరంలో గౌతమి నది తీరాన వెలసిన పుణ్య క్షేత్రం ఇదే..గోదావరి నది తీరానికి 2 కిలోమీటర్ల వంతెన దాటగానే రామ భక్తాగ్రేసరుడు. వీర హానుమాన్ అభయాస్తంతో భక్తులకు దర్శనమిస్తు కనువిందు చేస్తాడు..మరో అడుగు ముందుకేస్తే దివ్యక్షేత్రంగా బాసిల్లడానికి కారణబూతుడైన భద్ర మహర్శి ని సందర్శించుంకుంటూ ముందుకు వెళ్ళితే శ్రీరామ చంద్రుడిని మొదటి సారిగా సేవించన గిరిజన భక్తురాలు పోకల దమ్మక్క పలకరిస్తుంది. రామదాస్ భక్తికి చలించిన గోల్కొండ నవాబు తానీషా ఆపైన నీలి మేఘశ్యాముడిని కీర్తిస్తూ తన్మయత్వ పారవశ్యంలో మునిగితేలుతున్న భక్త రామదాసు ప్రతిమలు పలకరిస్తు భక్తులను కనువిందు చేస్తుండగా ఉన్న ప్రాంతమే రామయ్య కొలువైన భద్రగిరి…

..నారద మహర్శి మంత్రోప దేశంతో భద్రమహర్శి తారక మంత్రాన్ని జపిస్తు కొన్ని వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేసాడు..భద్ర మహర్ఝి తపస్సుకు రామచంద్రుడు మెచ్చి వైకుంఠం నుండి శ్రీమన్నారయణుడి అవతారంలో శంఖు చక్ర దనుర్దారిగా ప్రత్యక్షమై భద్ర మహర్ఝి వరం కోరుకోమన్నాడు..దేవ దేవుని మహరూపాన్ని చూసి తన్మత్వం చెందిన భద్ర మహర్శి తన శిరస్సు పైనే వేలసి కలియుగంలో భక్తులకు దర్శనం ఇవ్వాలని వేడుకొనగా భద్రమహర్శి కోరికను మన్నించి శ్రీమహ విష్షువు అవతారంలో వున్నా శ్రీరామచంద్రుడు స్వయం భు గా కోలువైనాడు. దీంతో ఆనాటి నుండి భద్రగిరిగా పేరోందిన పుణ్య క్షేత్రం అనంతర కాలంలో భద్రాచలంగా మారిందని పురాణాలు చెబుతున్నాయి.. రామదాసు కాలం నుండి నిత్వ కైంకర్యాలతో ప్రంచ వ్యాపితంగా భద్రాద్రి దివ్య క్షేత్రం భక్తి బావాన్ని సంతరించుకుంది…

..భద్రగిరిలో కోలువైన రామచంద్రుడిని మొదటగా సేవించింది.. నారద మహర్షి అని, పురాణాలు చెబుతున్నాయి.. అనంతర కాలంలో పోకల దమ్మక్క అనే గిరిజన భక్తురాలు పుట్టలో కోలువై వున్నా.. స్వామి వారిని దర్శించిన మొదటి భక్తురాలుగా స్ధల పురాణం చెబుతుంది. 17 శతబ్దా కాలంలో నెలకోండపల్లికి చెందిన కంచెర్ల గోపన్న భద్రాచలం తహశీల్ధార్ గా రావడం పుట్టలో వున్నా స్వామి దర్శించుకుని, రామచచంద్రుని పరమ భక్తురాలు దమ్మక్క హిత వచనంతో గోపన్న భద్రాచల దేవాలయాల నిర్మాణాన్నికి పూనుకుని.. ఈప్రాంతంలోని ప్రజల నుండి వసూలు చేసిన సోమ్ముతో శ్రీసీతారామచంద్రులకి శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేశాడు. రామ మందిర నిర్మాణానికి ప్రజలు కట్టిన కప్పంసొమ్మను దేవాలయం నిర్మాణానికి వినియోగించి దుర్వినియోగం చేశాడని ఆగ్రహం చెందిన గోల్కండ నవాబు తానీషా కంచర్ల గోపన్నకు జైలు శిక్ష విదించాడు. శ్రీరాముడిని నిత్యం భక్తి శ్రద్దలతో కొలిచే గోపన్న కారాగార శిక్ష విదించినా చలించలేదు. నిత్యం రామచంద్ర ప్రభును కీర్తించడంతో చలించి శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై ఆలయ నిర్మాణానికి గోపన్న ఖర్చు చేసిన సొమ్మును అణా పైసలతో సహ వడ్డీతో నవాబు కు చెల్లించి గోపన్నను విడుదల చేయించాడు. కష్ట నష్టాలు ఎదురైనా రామ నామా జపాన్ని మానలేదు. అప్పటినుండి గోపన్న పేరు రామదాసుగా మారింది. కలలో శ్రీరామ దర్శనం రామతత్వాన్ని అర్దం చేసుకన్న నవాబు గోపన్న విడుదల చేయడమే కాకుండా శ్రీరామ పర్వదినం సందర్బంగా జరిగే సీతా రాముల కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు పంపాలని పర్మానా జారి చేశారు. నేటికి ఆ సాంప్రదాయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో శ్రీరామ నవమికి రాష్ట్ర అదినేత హజరు కావడం ఆనవాయితిగా వస్తుంది.

..భద్రాచలంలో కొలువైన శ్రీరామ చంద్ర మూర్తి సంవత్సరం అంతా విశేష సేవలు అందుకుంటు భక్తులకు దర్శనమిస్తారు. ముఖ్యంగా శ్రీరామ నవమి సందర్బంగా 15 రోజులపాటు వేద మంత్రోత్చరణల మద్య బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.. బ్రహ్మోత్పవాల్లోనే సీతా రాముల కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు..కళ్యాణ రాముడిగా మోక్ష రాముడిగా ఆత్మ రాముడిగాభక్తులను సమ్మోహితులను చేస్తాడు. శ్రీసీతా రామ కళ్యాణం చూడటానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు ఆ రోజున భద్రచల క్షేత్రన్నిసందర్శించిస్తారు. జనవరిలో జరిగే ముక్కోటి ఏకాదదశికి జరిగే ఉత్సవాలను ఆరాదనోత్పవాలు అంటారు. రామచంద్రుడు ఈ పుణ్యక్షేత్రంలో వైకుంఠ నారాయణుడిగా అవతరించడంతో వైకుంఠ ఏకాధశి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్పవాలలో సీతా రామచంద్ర ప్రభు హంస వాహనంలో గోదావరి అలలపై నౌక విహారం చేస్తారు. ఉత్సవాలను కనులారా వీక్షించాలని దేశ వ్యాపితంగా భక్తులు తండోపతండాలుగా వస్తారు.సంవత్సరం పొడవున దివ్య మంగళ మూర్తికి పవిత్రోత్సవాలు, మాసోత్సవాలు, పక్షోత్సవాలు జరుగుతూనే ఉంటాయి. నిత్య కళ్యాణం.. పచ్చతోరణం అన్న నానుడిని నిజం చేస్తూ భక్తులు ప్రతి రోజు స్వామి వారికి భద్రాచలంలో కళ్యాణాలు జరిపిస్తూనే ఉంటారు.

..కోరిన కోర్కేలుతీర్చే కొంగు బంగారంగా రాముల వారిని భక్తులు కొలుస్తారు. ప్రకృతి రమణీయతకు అద్దంపట్టేలా వర్షాకాలంలో గలగల పారే గోదారి అందాలను తిలకిస్తు… గోదారమ్మ అలలపై నౌకా విహరం చేయవచ్చు. వేసవి కాలంలో గౌతమి నది తీరంలో సేద తీరుతు ఇసుక తిన్నేలపై వచ్చే పిల్ల తిమ్మెరలను ఆస్వాదిస్తు రామ నామ జపం చేయడం ఆహల్లదకరంగా ఉంటుంది. గోదావరిలో పుణ్యస్నానమాచరిస్తే సర్వ పాపాలహరిస్తాయని పురాణాలు చేపుతున్నాయి. వేలాదిగా వచ్చే భక్తులకు దేవస్థానం కాటేజిలు నిర్మించింది. స్థాయిని బట్టి వసతీ గృహాలు భక్తులకు అందుబాటులొ ఉన్నాయి. భద్రాచల దివ్య క్షేత్రాన్ని సందర్శించే భక్తులు ఇక్కిడకి 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలనను కూడా సందర్శస్తారు. వేల ఏళ్లుగా స్వామి దర్శణం చేసుకోవడానికి ఉత్సవాలలో పాల్గొనడానికి భక్తులు ఉత్సహం చూపిస్తూనే ఉన్నారు..

..జగదాభిరాముడు జగన్మాత సీతామహలక్ష్మీల కళ్యాణోత్సవాలు ప్రతియేటా అంగరంగవైభవంగా భద్రాచల దివ్యక్షేత్రంలో జరపడం ఆనవాయితీగా భక్తరామదాసు కాలం నుండివస్తుంది. శ్రీరాముడు పుట్టిన రోజే నవమి పర్వదినం రావడం అదే రోజు సీతా రాముల కళ్యాణం జరపడం భక్తులు ప్రశస్థమైనదిగా బావిస్థారు..
ఈ సంవత్సరం ఇంకో ప్రత్యేకత సంతరించుకుంది.
వైకుంఠ నారాయణుడి పుట్టిన రోజు శ్రీరామ కళ్యాణం జరపడం జరుగుతుంది. శోభకృత్ నామ సంవత్సరంలో సీతా మహాలక్ష్మీ పుట్టిన సమయం కావడంతో పుష్కర మహాపట్టాభిషేకం రావడం అదనపు ప్రాదాన్యత సంతరించుకుంది ఈ భద్రాద్రి కళ్యాణోత్సవాలకు ప్రత్యేకంగా 125 మంది ఋత్విక్కులతో యాగం నిర్వహిస్తు సీతారామచంద్రులకు నివేదించనున్నారు. ఈ యగ కృతువుకు 4 సముద్రాల తీర్దాలు.12 నదుల పవిత్రజలాలు.12 పుణ్యక్షేత్రాల పుష్కరిణి తీర్థాలతో అత్యంత వైభంగా యాగ కృతువును పండిత ఋత్విక్కుల వేదమంత్రోత్సరణతో భద్రాగిరి పునీతం చేస్తున్నారు. లోకనాయకుడు ధశరధతనయుడు రామచంద్రుడిని జనక మహారాజు తనయ జగన్మాత సీతమ్మవారిని ఆవాహయం చేస్తున్నారు. పట్టభిషేకం అనంతరం ఆదేవదేవునికి యాగ పలాన్ని భక్తుల సమక్షంలో నివేదించనున్నారు. ఈ సారి జరిగే సీతారమ కళ్యాణోత్సవాలకు మహ పుష్కర పట్టాభిషేకానికి అంత ప్రాముఖ్యత సంతరిచుకుంది..

.బ్రహ్మోత్సవాలలో ఒక్కో రోజు ఒక్కో ఉత్సవం నిర్వహిస్తూ ఈనెల 29 నుంచి ప్రధాన ఘట్టాలు ప్రారంభమవుతాయి..ఈనెల 29న ఎదుర్కోలు మహోత్సవం, 30న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సీతారాముల కళ్యాణం..ఈనెల 31న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం వేడుకలు జరగనున్నాయి…రాములోరి కల్యాణం, 31న జరిగే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక వేడుకలకు హాజరవ్వాలని సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసైకు దేవస్థానం అధికారులు, వైధికులు ఆహ్వానం పలికారు..మొత్తానికి భద్రాద్రి లో ప్రధానంగా జరిగే ఈ ఉత్సవాలను భక్తులు మెచ్చుకునేలా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటులు చురుగ్గా సాగుతున్నాయి..

.రాములోరి కళ్యాణం వీక్షించడానికి లక్ష మందిపైగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు..దానిలో బాగంగానే రెండు లక్షల లడ్డు ప్రసాదాలు సిద్దం చేస్తున్నారు..80 కౌంటర్ల ద్వారా తలంబ్రాలు,లడ్డు ప్రసాదం పంపిణీ చేయనున్నారు..

గతంలో బుజు పట్టిన లడ్డు ప్రసాదాలను భక్తులకు ఇచ్చిన నేపథ్యంలో ఆలయ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి..దీంతో ఈసారి ఆ పోరపాట్లు జరగకుండా నాణ్యతతో కూడిన లడ్దు ప్రసాదాలు సిద్దం చేస్తున్నారు..

..దేశంలోని నలుమూలల నుంచి భద్రాద్రి కి వచ్చే భక్తుల కోసం ఎలాంటి లోటు లేకుండా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.రాములోరి కళ్యాణంకు వచ్చే భక్తులకు ఏటువంటి ఇబ్బందుల రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటున్నారు భద్రాద్రి రామాలయ ఈవో రమాదేవి అన్నారు..లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం భద్రాద్రి దేవస్థానం రెండు కోట్ల 25 లక్షల నిధులను కేటాయించామన్నారు.
భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే ఆలయ పరిసరాల్లోని ఆరు ప్రాంతాల్లో దివిస్ లేబరేటరీస్ కంపెనీ ఆధ్వర్యంలో ఒక కోటి నాలుగు లక్షలతో మంచినీటి పథకాలను సిద్ధం చేశామన్నారు..

 

 

Leave A Reply

Your email address will not be published.