సురక్ష దినోత్సవ ర్యాలీ ఏర్పట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

ఆదిలాబాద్: జూన్ 6వ తారీఖు ఉదయం 9 గంటలకు ఆదిలాబాద్ జిల్లా పోలీస్ హెడ్ కోటర్స్ నందు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధుల సమక్షంలో నిర్వహించనున్న సురక్ష దినోత్సవ భారీ ర్యాలీ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించారు.ఈసందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంరక్షణలో, ప్రజలకు కల్పిస్తున్న వివిధ రకాల సేవలకు సంబంధించి 14 రకాల వర్టికల్స్ పై భారీ శకటాలతో జిల్లాకు కేటాయించిన డయల్ హండ్రెడ్, పెట్రో కార్, షీ టీం వాహనాలతో పట్టణంలోని ప్రధాన కూడళ్లను అనుసరిస్తూ భారీ ర్యాలీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ఈర్యాలీ నందు డయల్ హండ్రెడ్, షి టీం, రిసెప్షన్, క్లూస్ టీం, పెట్రో కార్, సైబర్ క్రైమ్, క్యూఆర్టి, స్పెషల్ పార్టీ, లాంటి అంశాలపై పూర్తి అవగాహనతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి శకటాలను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిఎస్పి వి ఉమేందర్, సీఐ కే సత్యనారాయణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, ఎం శ్రీపాల్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.