వివి ఫ్యాట్ ల ద్వారా ఓటు వేయడం పై ప్రజలకు అవగాహన కల్పించాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్

ఆదిలాబాద్‌: ఈవీఎం, వివి ఫ్యాట్ ల ద్వారా ఓటు వేయడం పై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలో ఈవీఎం, వివి ప్యాట్ ల ప్రదర్శన కేంద్రాన్ని కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈవీఎం, వివి ప్యాట్ ల ద్వారా ప్రతి ఒక్కరికి ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుండి కలెక్టరేట్ కు వచ్చే ప్రజలకు ఓటు వేసే విధానం పై అవగాహన కల్పించి వారి సందేహాలను నివృత్తి చేయాలనీ సిబ్బందికి సూచించారు. ఇప్పటికే ఆదిలాబాదు, బోథ్ నియోజక వర్గాలకు ఒకటి చొప్పున రెండు ప్రచార రథాలను ఏర్పాటు చేసి ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్లకు ఓటు వేయడం ఎలా అనే అంశంపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి ఓటరు పోర్టల్ లో తమ ఎపిక్ నంబర్ ను ఎంటర్ చేసి వివరాలను పరిశీలించుకోవాలని ఈ సందర్బంగా కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్ రాథోడ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియ, నాయబ్ తహసీల్దార్ శ్రీవాణి, సాంకేతిక సహాయకులు ఉమాకాంత్ , సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.