విద్యుద్ఘాతంతో రైతు మృతి

బజార్ హత్నూర్: మండలం లోని కొలహరి గ్రామ పంచాయతీ కి చెందిన రైతు పుంజారాం (32) మంగళవారం ర ఉదయం కరెంట్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఆగ్రామస్తులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..రైతు పొలంలో దౌర కొడుతున్న క్రమంలో కరెంట్ తీగ పలుగుకు తగిలింది. పలుగు, దౌర ఇనుముతో చేసినది అయినందున వెంటనే షాక్ గురైనది. ఎద్దుల మేడలో కర్ర తో చేసిన కాడి ఉన్నందున అవి ప్రమాదం నుంచి బయట పడినవి. గత రోజు వరకు మోటారు పంపుకు తీసుకుని వెళ్లిన కరెంట్ తీగలు భూమిపై వాలి ఉన్నందున ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. పొలం లో పని చివరి గడియకువచ్చిన పిమ్మట ప్రమాదం సంబవించినది.ఈ సంఘటన తో ఆ గ్రామంలోని పలువురు విచారం వ్యక్తం చేశారు.చేతి కొచ్చిన యువరైతు మరణంతో ఆకుటుంబంలో విషాదం చోటు చేసుకొంది.మరణించిన వ్యక్తికి తల్లీ, భార్య రేణుక, కూతుళ్లు సంజన (12,)మోనికా (8), సంవత్సరం లు గల వారున్నారు. చిన్న వయసు గల ఒక కొడుకు సాయి ఉన్నట్లు తెలిపారు.ఈ మేరకు బజార్ హత్నూర్ పోలీస్ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.