వడదెబ్బతో వీఆర్ఏ మృతి

బోథ్: మండలంలో కరత్వాడ గ్రామానికి చెందిన కుర్మే అశోక్ (33) అనే వ్యక్తి బోథ్ తాసిల్దార్ కార్యాలయంలో వీఆర్ఏగా విధులు నిర్వహిస్తుండగా వడదెబ్బ తగిలి మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… కుర్మె అశోక్ విధులలో భాగంగా బుధవారం మండల కార్యాలయంలో కొన్ని పత్రాలు సబ్మిట్ చేసి ఉండగా ఆ తరుణంలోనే తీవ్ర తలనొప్పి జ్వరనికి గురి కావడం జరిగిందని, విధులు పూర్తయ్యాక ఇంటికి వెళ్లేసరికి జ్వరం తలనొప్పి ఎక్కువైయ్యే సరికి మండలంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లగ వైద్యులు పరీక్షించి జ్వరం ఎక్కువగా ఉందని ఏదైనా పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించలని తెలుపగా వడదెబ్బ తగిలిన బాధితున్నీ జిల్లాలోని రిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. చికిత్స పొందుతు అశోక్ శుక్రవారం మృతి చెందారు. ఆతనికి భార్య భారతి, కొడుకు చరణ్ తేజ (15) కూతురు సుదీక్ష (13 ) వయస్సు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారికి ఉండడానికి సరైన ఇల్లు లేక పిల్లలు బ్రతకడానికి ఏలాంటి ఆధారం లేకపోయిందనీ వీఆర్ఏ అశోక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని వారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు కోరుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.