లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్

ఆదిలాబాద్ :భారీ వర్షాల వలన సమస్యలు ఎదురైతే తక్షణ సహాయం కోసం ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ -18004251939 ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరుగకుండా జిల్లా యంత్రాంగం పర్యవేక్షించడం జరుగుతుందని, సమస్యలు తలెత్తితే తక్షణ సహాయానికి టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.