రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

ఆదిలాబాద్: పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిధిలో జరుగుతున్న రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనులను రైల్వే అడిషనల్ డివిజనల్ ఇంజనీర్, మున్సిపల్ విభాగం అధికారులతో కలిసి మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పరిశీలించారు. పలు పనులను శనివారం ఆయన పరిశీలించి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై ఆరా తీశారు.