మహిళా నక్సలైట్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పీఎల్‌జీఏ సభ్యుడి హతం

ఆదిలాబాద్: మహిళా మావోయిస్టులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న పీఎల్‌జీఏ సభ్యుడిని మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించి హతమార్చినట్లు తెలిసింది ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కాంకేర్‌ జిల్లాలో బుధవారం చోటు చేసుకోగా గురువారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది.వివరాల ‍ప్రకారం.. పీఎల్‌జీఏ 17వ బెటాలియన్‌కు చెందిన మను దుగ్గ పార్టీలో పనిచేస్తున్న మహిళా మావోయిస్టులపై అసభ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆయనపై మహిళా మావోయిస్టులు అగ్ర నాయకులకు ఫిర్యాదు చేయగా.. వారు పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం కాంకేర్‌ జిల్లాలోని దండకారణ్య ప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించి. తర్వాత రోజు మావోయిస్టులు ఆయనను హతమార్చారు. ఈ మేరకు లేఖను కూడా మృతదేహం వద్ద వదిలారు. కాగా, మావోయిస్టులు హతమార్చిన పార్టీ పీఎల్‌జీఏ సభ్యుడు మను దుగ్గపై ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డు ప్రకటించింది…

Leave A Reply

Your email address will not be published.