మంత్రులను కలిసిన ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్

ఆదిలాబాద్: బుధవారం హైద్రాబాద్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ నియోజకవర్గం నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.నియోజకవర్గంలోని గిరిజన తండాలు సమస్యలను మంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకొని వెళ్లగా మంత్రి సానుకూలంగా స్పందించారు.అనంతరం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నీ కలిసి పెంబి మండలంలోని పుల్గంపండ్రిలో సబ్ స్టేషన్ ఏర్పాటు చెయ్యాలని విన్నవించగా ఎమ్మెల్యే గారి విన్నపము మేరకు సీఎండీ అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు._