మండలంలో పోలీస్, ఆప్కారి సంయుక్త దాడులు

జన్నారం: మండలంలో పోలీసులు ఆప్కారి వారు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మంగళవారం జన్నారం పోలీసులు లక్షేట్టిపేట ఆప్కారి శాఖా వారు సంయుక్తంగా అక్రమ గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. మండలంలోని లింగయ్యపల్లె గ్రామంలో అక్రమంగా గుడుంబా వ్యాపారం చేస్తున్న దర్పుల రామ్నాయక్ ను పట్టుకొని అతని వద్ద 3 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో జన్నారం ఎస్ ఐ పి సతీష్ లక్షేట్టిపేట ఆప్కారి ఎస్ ఐ మౌనిక వారి వారి సిబ్బంది పాల్గొన్నారు.