ప్రతి విద్యార్థికి ప్రవేశం కల్పించేలా చర్యలు తీసుకోవాలి

ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి చాహత్ బాజ్ పాయ్

ఉట్నూరు: గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ప్రతి విద్యార్థికి ప్రవేశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి చాహత్ బాజ్ పాయ్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఉట్నూరు మండలం లాల్ టేకిడి ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాలలో ప్రవేశాల కై నిర్వహించిన కౌన్సిలింగ్ ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ, ప్రతి గిరిజన విద్యార్థికి రెసిడెన్షియల్ కళాశాలలో ప్రవేశం కల్పించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఇప్పటివరకు 212 మందికి ప్రవేశాలు కల్పించినట్లు తెలిపారు. కళాశాల నుంచి మరో కళాశాలకు కోరుకున్న విద్యార్థులకు బదిలీలు కూడా చేయడం జరిగిందని అన్నారు. అనంతరం హస్నాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఓపి నమోదు, రోగులకు అందుతున్న వైద్య చికిత్సలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను పరిశీలించి ప్రజలకు నాణ్యమైన వైద్య చికిత్సలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. డాక్టర్ పోస్టు భర్తికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. అనంతరం హస్నాపూర్, నార్నూర్ మండలం జామడ ఆశ్రమ పాఠశాలలలో స్టార్ రూమ్, వంట గదులను సందర్శించి సరుకులను పరిశీలించారు. సందర్శించి విద్యార్థులకు పాఠాలు బోధించారు. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు పరిశుభ్రమైన భోజనాన్ని అందించాలని సూచించారు. ప్రతి విద్యార్థికి అభ్యాస సామర్ధ్యాలను పెంచేలా భోదన చేయాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అన్నారు. ఉపాధ్యాయులు, వార్డెన్లు సమయపాలన పాటించి విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడాలని సూచించారు. అనంతరం జామడలో ఉట్నూరు డివిజన్ ప్రధానోపాధ్యాయులు, వార్డెన్ల తో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేశారు. e సందర్బంగా పీవో మాట్లాడుతూ, ప్రతి పాఠశాలలో తరగతుల వారీగా పాఠ్య పుస్తకాలును త్వరితగతిన పంపిణీని పూర్తీ చర్యలని సూచించారు.. నిర్దేశించిన గడువులోగా ఆహార పదార్థాల సరఫరా, ప్రతి పాఠశాలలో ఖచ్చితంగా మెను పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాలలో డిడి దిలీప్ కుమార్, ఆర్సీ ఓ గంగాధర్, ఏసీ ఎం ఓ జగన్, ఏటిడి ఓ క్రాంతి, ఉపాధ్యాయులు, వార్డెన్లు తదితరులు పాల్గొన్నా

Leave A Reply

Your email address will not be published.