నెత్తురోడిన జాతీయ రహదారి

న‌లుగురు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు

గుడిహత్నూర్: మండలం మేకల గండి జాతీయ రహదారిపై తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 4గురు అక్కడికక్కడే మృతి చెందగా 5గురు తీవ్ర గాయాలతో రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుడిహత్నూర్ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం శుక్ర‌వారం ఉదయం ఇచ్చోడ నుండి అందజా 3 గ,, లకు ఓ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు ముగించుకుని 9మందితో ఆటోలో ఆదిలాబాద్ బయలుదేరారు. అయతే గుడిహత్నూర్ మండలం మేకల గండి వద్ద వెనక నుండి వస్తున్న ఓ గుర్తుతెలియని భారీ వాహనం బలంగా ఢీకొట్టడంతో న‌లుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు ఘటనస్థలంలో చెల్లాచెదురుగా పడివుండగా పోలీసులు ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు, తీవ్ర గాయాలతో ఉన్న వారికి చికిత్స అందిస్తున్నారు. ఆటోపైకి దూసుకెళ్లిన వాహనాన్ని పోలిసులు గాలిస్తున్నట్లు సీఐ కిరణ్ తెలిపారు మృతులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన శైలజ 35,పొచ్చన్న( 65),సలోమీ (62), గంగు (50), పోలీసులు గుర్తించారు, గాయపడినవారు మడవి ప్రేమ్ సాగర్ (46), మడవి దీపక్ 15, తేజ వర్ధన్ (12), ఆరాధ్య (2), చిన్ని (8) గాయాలపాలై రిమ్స్ లో చికిత్స పొందుతున్న ట్లు పోలీసులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.