త్రీఫేస్ కరెంటు ఇవ్వాలని అన్నదాతల ఆందోళన

బేల‌: 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న బి.ఆర్.ఎస్ ప్రభుత్వం రైతులకు కనీసం విద్యుత్ సరఫరా అందించలేకపోతోందని యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రుపేష్ రెడ్డి ఆరోపించారు.బేలా మండలంలో 24 గంటల త్రీఫేస్ విద్యుత్ సరఫరా చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి ఆందోళనకు దిగారు.ఇందులో భాగంగానే బేల మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై శనివారం రైతులతో కలిసి రాస్తారోకో చేశారు.దీంతో రోడ్డు కు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి.ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా సామ రుపేష్ రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ఆరంభమైనప్పటికీ ప్రస్తుతం కేవలం 14 గంటలు మాత్రమే కరెంట్ సరఫరా చేస్తూన్నారని అన్నారు.గత సంవత్సరం మాదిరిగానే 24 గంటల త్రి ఫేస్ కరెంటు ఇవ్వాలని స్పష్టం చేశారు.సరఫరా చేసే కరెంటు సైతం గృహా అవసరాలకు,వ్యవసాయానికి ఒకేసారి ఇవ్వడంతో లో ఓల్టేజీ సమస్య నెలకొని విద్యుత్ మోటర్లు,ఫీజులు కాలిపోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు.కావున అన్నం పెట్టే అన్నదాతకు 24 గంటల త్రీఫేస్ కరెంటు అందించాలని పేర్కొన్నారు.అదేవిధంగా ఇక్కడున్న ఎమ్మెల్యే జోగు రామన్న కు రైతులు పడుతున్న ఇబ్బందులు కనబడుటలేవా అని అన్నారు.రైతులు పండించిన పంట పండకపోతే అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.ఇప్పటికైనా రైతులకు 24 గంటలు త్రీఫేస్ కరెంటు ఇవ్వకపోతే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి విద్యుత్ శాఖ కార్యాలయాన్ని రైతులతో కలిసి పెద్ద మొత్తంలో ముట్టడించడం జరుగుతుందని అన్నారు.అనంతరం విద్యుత్ శాఖ సబ్ ఇంజనీర్ వినోద్ కు వినతిపత్రం అందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రాందాస్ నాక్లే,బేల మండల మాజీ మార్కెట్ చైర్మన్ వామన్ వాంఖడే,మాజీ సర్పంచ్ గాన్ శ్యామ్,బేల మండల్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు విట్టల్, ఏఎన్‌టీయూసీ బేల మండల అధ్యక్షుడు ఎండీ అఖిల్,మాజీ సర్పంచ్ రూప్ రావు,బేల మండలం ఎస్టి సెల్ అధ్యక్షుడు మాడవి చంద్రకాంత్,కన్య రాజు,కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాడే సంతోష్,బోయర్ శంకర్, సీతారాం,విపిన్ ఠాక్రే,బోక్రే శంకర్,విజయ్, అవినాష్,బాపురావు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.