ట్రాక్టర్ బోల్తా అన్నా, తమ్ములు (ఇద్దరు) మృతి

కౌటాల: మండలంలోని వైగాం గ్రామంలో సోమవారం విద్యుత్ స్తంభాల లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడగ అందులో కూలీలుగా పనిచేస్తున్న బెజ్జుర్ మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు బుర్రి వసంత్ (26)బుర్రి అనిల్ (24) అనే యువ కూలీలు ట్రాక్టర్ బోల్తా పడగా ట్రాక్టర్ లోని కరెంట్ స్తంభాలు మీద పడి అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ముంజంపల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు మృతి చెందడం పట్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.