గ్రీన్ సిటీ అవార్డుతో మున్సిపల్ చైర్మన్

ఆదిలాబాద్: అటవీ శాతాన్ని గణనీయంగా పెంచడం, జీవకోటికి స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమాన్ని ఆదిలాబాద్ పట్టణంలో పకడ్బందీగా అమలు చేసి, పచ్చదనం పెంపు కోసం చేసిన ప్రత్యేక కృషికి గానూ గ్రీన్ సిటీ అవార్డుకు ఎంపిక అయింది. ఇటివల రెవెన్యూ వృద్ధి, మెరుగైన సేవల విభాగంలో పురపాలకం ఓ అవార్డును సాధించగా.. తాజాగా మరో అవార్డు వరించడం పట్టణ పురోగతికి అద్దం పడుతోంది. కాగా సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించిన తెలంగాణ హరిత ఉత్సవ వేడుకల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ గ్రీన్ సిటీ అవార్డును స్వీకరించారు. పట్టణంలో పచ్చదనం పెంపు కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పకడ్బందీగా అమలు చేయడంతో సత్ఫలితాలు రాగా.. మంత్రి మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్, కమీషనర్ శైలజలను ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్పూర్తిని భవిష్యత్తులోనూ కనబరుస్తూ పట్టణాన్ని అన్ని రంగాల్లో ముందుంచాలని ఆకాంక్షించారు.