ఓవైపు వ్రత పూజలు…. మరోవైపు చికెన్ భోజనాలు

గుడిహత్నూర్ మండల రైతు వేదిక దగ్గర రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అవతరణ దశాబ్ది ఉత్సవాలు సందర్బంగా ఏర్పాటు చేసిన భోజనాలు స్థానిక మహిళలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. వట సావిత్రి వ్రతాని పురస్కరించుకుని మహిళ భక్తులు ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా రైతు వేదిక సమీపంలోని మర్రి చెట్టుకు పూజలు చేయడానికి ఎక్కువ సంఖ్యలో వచ్చారు. పక్కనే రైతులకు ప్రభుత్వ యంత్రాంగం మాంసాహార భోజనం ఏర్పాటు చేయడంతో చికెన్ ముక్కలు దాటుకుంటు ముక్కు మూసుకుని పూజలు చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక జడ్పిటిసి సభ్యుడు పతంగే బ్రహ్మనంద్, ఎంపిపి భరత్ బిజెపి కార్యకర్తలతో కలిసి అందోళన చేశారు. అనంతరం పంచాయతీ సెక్రటరీ రాందాస్ తో మాట్లాడిన తర్వాత అక్కడ నుంచి దూరంగా బోజనాలను తరలించి మహిళ భక్తులను ఇబ్బందిపడ్డకుండా చూశారు. మహిళలు స్థానిక అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపించింది.

Leave A Reply

Your email address will not be published.