అటెండర్ కు చెప్పులతో దేహశుద్ధి
ఆడవారితో ఫోన్లో అసభ్యంగా మాట్లాడిన అటెండర్

నేరడిగొండ హలో నీకు ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలా అయితే నాతో మాట్లాడు..లేదా నీ దరఖాస్తులను రిజెక్ట్ చేసేస్తా…నేను..తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిని మాట్లాడుతున్న రిప్లై ఇవ్వవా.. అంటూ తహసీల్దార్ కార్యాలయంలో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న మహిళను కార్యాలయ అటెండర్ రాత్రి సమయంలో ఫోన్లో అసభ్యకర వాట్సాప్ లో మెసేజ్లు, వాయిస్ రికార్డులు చేస్తూ వేధించడంతో ఆ మహిళ కుటుంబీకులు అటెండర్ ను దేహశుద్ధి చేసిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో చోటుచేసుకుంది. నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన ఒక వివాహిత ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం తహసీల్దార్ కార్యాలయంలోదరఖాస్తు చేసుకోగా, దరఖాస్తు ఫారం లో ఉన్న మహిళ ఫోన్ నెంబర్ ను తీసుకొని తహసీల్దార్ కార్యాలయానికి చెందిన అటెండర్ అశోక్ నేను..తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది రవిని అంటూ అటెండర్ ఆ సదరు మహిళను బుధవారం రాత్రి ఫోన్లో అసభ్యకర మెసేజ్లు పంపుతూ వేధిస్తున్నాడు. నీకు సర్టిఫికెట్స్ కావాలి అంటే నాతో మాట్లాడు లేదా నీ సర్టిఫికెట్స్, రేషన్ కార్డ్ మొత్తం రిజెక్ట్ చేసేస్తా అది నా చేతిలోని పని అంటూ ఆ మహిళకు అసభ్యకర మెసేజ్లు చేయడంతో మెసేజ్ మహిళా కుటుంబీకులు గురువారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి జూనియర్ అసిస్టెంట్ రవి ని నిలదీయగా ఆ వాయిస్ నాది కాదు అనడంతో ,అటెండర్ స్వగ్రామానికి వెళ్లి అటెండర్ అశోకుని చెప్పుతో దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. దీంతో ఒకేసారి తహసీల్దార్ కార్యాలయంతో పాటు మండల కేంద్రంలో అలజడి రేగింది. ఎస్సై సాయన్న కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.