పూటకో రంగులో దర్శనమిస్తున్నా పుడమిబిడ్డల‌‌ నాగోబాఆలయం

సర్పలోక స్వర్గం దివి నుండి భువికి దిగివచ్చింది.. ఎడు తలల సర్పమే స్వాగతం పలుకుతోంది .. నాగ లోకాన్ని మరిపిస్తోంది నాగోబా ఆలయం.పూటకో రంగులో దర్శనమిస్తోంది పుడమి బిడ్డలను పూనితులను చేస్తోంది. అదివాసీల అద్బుతమైన నాగొబా ఆలయం‌ ప్రత్యేక కథంం

ఆదిలాబాద్
. ‌అదివాసీ బిడ్డల. అరాద్య దైవం…‌మేస్రం వంశీయుల ఇలవేల్పు.. నాగోబా దేవుడు..పుస్యమాసం వచ్చిందంటే చాలు… అదివాసీలు పున్నమి నాగుకు పూజలు నిర్వహిస్తూ మేస్రం వంశీయులు పులికించిపోతుంటారు..ఆ అరాధ్యమైనా శేషనారయణునికి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవేల్లి మండలం కేస్లపూర్ గూడేంలో అద్బుతమైన ఆలయాన్ని నిర్మించారు..

ఆ ఆలయం నిర్మాణం అందరిని అకట్టుకుంటోంది.. కన్నులను కనువిందు చేస్తోంది… చూపరులను మురిసిపోయేలా చేస్తోంది.. ఆలయంలో ప్రతి శిల్పం, శిలలు దేవుని రూపాలు కళ్లముందు కదిలేలా చేస్తోంది..స్వర్గంలో సర్పలోకం ఉంటుందో… అలా స్వర్గంలో ఉండే సర్ప లోకాన్ని నాగోబా ఆలయం మరిపిస్తుందంటున్నారు.. ఆలయంలో నాగోబా పూజించే విదానం… అదేవిధంగా అదివాసీల సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబించేలా శిలల పై చెక్కారు శిల్పులు… ఆలయం శిల్ప సంపదను చూస్తే చాలు.. పుస్యమాస్య సందర్భంగా నిర్వహించే జాతర సందర్భంగా అచారాలు సంప్రదాయాలు, పూజా విదానాలు ఆలయంలో ప్రతిబింబిస్తుండటం విశేషం..‌ ఇంతటి పవిత్రమైనా దేవాలయంలో నాగోబా ను పూజిస్తేవాలు..‌ దేవుడే ప్రత్యక్షమవుతాడమని అదివాసీల. నమ్మకం‌‌‌ …భక్తులు కోరిన. కోరికలు నేరవేర్చే దేవుని శేషనారయణున్ని అదివాసీలు కోలుస్తామంటున్నారు అదివాసీలు.

.. నూతన నిర్మించిన. ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.. చూస్తే కళ ఉట్టిపడమే కాదు…ఆపురూమైనా అందాలు కనిపిస్తున్నాయి… అదేవిధంగా ఆలయాన్ని ఏర్రరాతి శిలతో నిర్మించారు… ఈ ఆలయానికి ఎన్నో‌మహిమలు ఉన్నాయి.. ఆలయం రంగులు మార్చుతోంది..‌ఉదయం పూట ఒక రంగులో, మద్యహన్నం మరోక రంగులో, సాయంత్రం పూట. ఇంకోక రంగులో ఆలయం దర్శనమిస్తోంది.. ఈ ఆలయం. రంగుల మార్చడం చూసి భక్తులు పరవసించిపోతున్నామంటున్నారు మేస్తం శేఖర్… దీనితో పాటు రాతి శిల్పాలను, రాతి స్తంభాలను చేతితో కోట్టితే వింత శబ్దాలు వస్తున్నాయని .. అ శబ్దాలు విని. భక్తులు ఆశ్చర్యాన్ని వ్యక్యం చేస్తున్నారు

 

. అయితే అద్బుతమైన ఆలయం నిర్మాణానికి అర్కిటేక్ లు లేరు. అదివాసీలే అర్కిటెక్కులు… రూపశిల్పులుగా నిలిచారు‌. అదివాసీ అచారాలు, సంప్రదాయాలను ,అదేవిధంగా నాగోబా మహిమలు, జాతర సందర్భంగా నిర్వహించే ఊహచిత్రాలను అదివాసీలే డిజైనా. చేశారు… ఆలయంలో ప్రవేశించే మేట్ల నుండి నాగోబా గర్బడికి వెళ్లే మార్గంలో స్వాగతం పలికే ఎడు తలల సర్పేంద్రుడు వరకు మేస్రం వంశీయులు డిజైన్ చేశారు… అక్షరజ్నానం అంతగా లేకున్నా…అర్కిటేకులు కాకున్నా అద్బుతమైన పరిజ్నానం అదివాసీలకు శిల్పులకు అందించారు… మేస్రం వంశీయులు ఇచ్చిన డిజైన్ మేరకు ఆలయాన్ని శిల్పులు అద్బుతంగా తీర్చిదిద్దారు..

అదివాసీలకు అర్థికంగా అణా పైసా లేకున్నా… నాగోబా పై కోడంత. భక్తి ఉంది….ఆ భక్తే, దైవత్వమే అదివాసీల అద్బుతమైన ఆలయాన్ని నిర్మించేలా చేసింది… ఆలయం నిర్మాణం కోసం దాతల వద్ద చేయిచాచి చందాలు అడగలేదు.. సర్కార్ సహాయం చేయాలని అడగలేదు…‌మా గుడి .. మా డబ్బులతో నిర్మించాలని నిర్ణయించారు… మేస్రం వంశీయులు ఏకమయ్యారు…. ఆలయ నిర్మాణం కోసం వేయ్యి కుటుంబాల నుండి రుపాయి రుపాయి సేకరించారు,… ఆ విదంగా పది లక్షలు , కోటి … రెండు కోట్లు కాదు… ఐకంగా ఐదు కోట్లు సేకరించారు….ఐదేళ్లలో ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేలా నాగోబా ఆలయాన్ని అద్బుతంగా నిర్మించారు…..నాగోబా దైవత్వమే తమను ఆలయాన్ని నిర్మించేలా చేసిందని చైర్మన్ తుక్కారాం ఆనందం వ్యక్తం చేస్తున్నారు

Leave A Reply

Your email address will not be published.