నీళ్లకోసం ఆరు కిలోమీటర్లు నడుస్తున్నా గిరిజనులు
తీవ్రమైన నీటికోరతతో ఇబ్బందులు పడుతున్నా అదివాసీలు

…నీళ్లు. గిరిజనులకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి….. అదివాసీ బిడ్డలకు దాహం తీర్చుకుందామంటే చుక్కనీరు లేదు..ఆ నీటి కోసమే కిలోమీటర్ల దూరం కాలినడకన.వెళ్లుతున్నారు.. పంటపోలాల బావుల. నుండి నీళ్లను తెచ్చుకుంటున్నారు…పశువుల త్రాగే నీళ్లను త్రాగుతున్నారు…. రోగాల బారిన పడుతున్నారు.. ఆదిలాబాద్ జిల్లా లో నీటికోసం అదివాసీ బిడ్డల యుద్దంపై ప్రత్యేక కథనం
.. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం సుంగా పూర్ గిరిజన గూడేం ఉంది.. ఇది రాజస్థాన్ లో థార్ ఏడారి ప్రాంతంలో ఉన్నా గూడేం కాదు…కాని అంతకు మించి నీటి కష్టాలు ఉన్నా గూడేం…. గూడేంలో మూడు వందల మంది నివసిస్తున్నారు… నాలుగు దశాబ్దాలుగా అవాసం ఉంటున్నా … వేసవిలో దాహం తీర్చుకుందామంటే కసికేడు నీళ్ల దోరకని దయనీయమైనా పరిస్థితులు ఉన్నాయి..
.. ఆ దాహం తీర్చుకోవడానికి అదివాసీ బిడ్డలు పడేపాట్లు అన్ని ఇన్ని కావు.. నీటి కోసం ఉదయం ఐదు గంటలకు పంటపోలాల్లో ఉన్నాబావి వద్దకు వెళ్లుతున్నారు..ఈ బావి గూడాన్ని అనుకోనిలేదు.. గూడానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది…పైగా ఆ బావి వద్దకు వెళ్లాలంటే… కోండలు ఎక్కాలి…బండలు దాటాలి…అప్పుడే బావి వద్దకు చెరుతారు… సర్కస్ పీట్ల సాహసాలు చేస్తూ అదివాసీ బిడ్డలు బావివద్దకు చేరుకుంటున్నారు…ఆబావిలో నీటిని అతికష్టం మీద తోడుకోని బిందేళలలో నింపుకుంటున్నారు.. బిందేళలో నింపుకోని నేత్తిపై మోతలు మోస్తూ ఇంటికి నీళ్లను తెచ్చుకుంటున్నారు గిరిజనులు..
.ఈ కరువు సీమలో నీటికి విలువ ఉన్నా అంత ఇంతకాదు.. వర్షపు చుక్కనీరు వదలడంలేదు… వర్షపు నీరు ఇండ్ల పై పడితే… నీరు ట్యాంకులో పడేవిదంగా రేకుతో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకున్నారు..ఇంటిపడిన ప్రతి వర్షపు చుక్క. రేకు కాల్వలో పడుతుంది….ఆ నీటితో ప్లాస్టిక్ ట్యాంక్ నిండుతోంది.. ట్యాంక్ లో పడిన నీరును పిల్లలస్నానం కోసం వాడుతున్నామని గిరిజనులు వాడుతున్నారు..నీళ్లు లేక ప్రతిరోజు స్నానం చేయించడం లేదు..వారానికి ఒకరోజు ఇలా స్నానం చేయిస్తున్నామని గిరిజనులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.. గ్రామానికి నీరు అందించడానికి మిషన్ భగీరథ ట్యాంకు నిర్మించారు…కాని అందులో నుండి బిందేడు నీళ్లు రావడం లేదనితుడుం దెబ్బ నాయకులు విజయ్, గణేష్ అందోళన వ్యక్తం చేస్తున్నారు..