అదివాసీలు వ్రుత్తుల నైపుణ్యంలో వాళ్లకు వాళ్లే సాటి

అందరికి స్పూర్తిని ఇస్తున్నా అదివాసీలు

…అడవి బిడ్డలు…అన్ని వ్రుత్తుల్లో  అరి తేరిన వాళ్లు…..ఇంటిని  నిర్మించడంలో అర్కిటెక్ ను ‌మించినవాళ్లు… నాగలిని  తయారు చేయడంలో  వండ్రంగికి  పని‌ నేర్పే వ్రుత్తి నైపుణ్యం వారి సోంతం.. కోలిమిని   రాజేస్తారు..‌ఇనుము  కరిగిస్తారు….పంట. పనుల కోసం కోడవళ్లు, పలుగు పారలు  తయారు చేస్తారు.. శారీరక శ్రమ వ్రుత్తి నైపుణ్యం కాదు.. దేవుడిని  మెప్పిండానికి    ‌మునుల్లా  మంత్రాలు జపిస్తారు..  అంతేకాదు  పూజారులను   మరిపించేలా    పెళ్లిల్లను జరిపిస్తున్నారు..  అన్ని వ్రుత్తుల్లో అరితేరిన అదివాసీ బిడ్డల పై ప్రత్యేక. కథనం

..అగ్గి రాజేసిన వాళ్లు.. మనుషులకు  నాగరికత నేర్పిన వాళ్లు… అదివాసీలు..  బ్రతుకుంతా   అడవుల్లోనే… అవాసం… కాని గిరిజనులకు  వ్రుత్తుల్లో   నైపుణ్యం అమోఘంగా ఉంటుంది  ..సాదారణంగా   గ్రామాలలో  వ్రుత్తుల విభజన ఉంటుంది..‌ఒక్కోక్కో పనిని  ఒక్కోక్క కులం వారు చేస్తుంటారు.  ఇలాంటి వ్రుత్తుల విభజన.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అదివాసీ గూడలలో  శ్రమ విభజన ఉండదు..

.. వ్రుత్తుల విభజన లేక పోవడం వల్ల అన్ని  పనులు   వారే చేసుకుంటారు… వ్యవసాయం చేయాలంటే  రకరకాల. పని ముట్లు  అవసరం ఉంటాయి…వ్యవసాయానికి అవసరమయ్యే నాగలి,  ఎండ్ల బండ్లు,  పత్తిలో గడ్డిని తీయడానికి గుంటుక వంటి   యంత్రాలను కర్రలతో తయారు చేస్తారు.. వండ్రంగులు ఏవిదంగా తయారు చేస్తారు అంతకు మించిన నైపుణ్యం తో అదివాసీలు తయారు చేస్తున్నారు.‌అదేవిదంగా కోలిమిలో పలుగు,పారలు, కోడవళ్లు, గోడ్డళ్లు వంటివి తయారు చేసుకోని వ్యవసాయానికి  వినియోగించుకుంటున్నారు..ఇక  ఇండ్ల.  నిర్మాణం సైతం… వారే నిర్మించుకుంటున్నారు.. ఇంటి గోడలు,  కప్పు పై గూనలు వేయడం,  వంటి పనులు చూస్తుంటే   అద్బతమైనా అర్కిటేక్చర్స్ మరిపిస్తున్నారు   అదివాసీలు..  ఇండ్లను నిర్మించిన తర్వాత. గోడల. పై  వేసే   ముగ్గులు పెయింటింగ్  తలపించేలా ఉన్నాయి..

  అదేవిధంగా అదివాసీలు   ప్రక్రుతిని పూజిస్తూ రకరకాల పండుగలు నిర్వహిస్తారు..పేర్సపేన్, పేద్ద దేవేరా, గ్రామ దేవతలకు పూజలు నిర్వహిస్తారు…దీపావళి సందర్భంగా  గుస్సాడీ పండుగను చేసుకుంటున్నారు.. అయితే ఈ సందర్భంగా పూజ కార్యక్రమాలన్నింటిని    దేవరి నిర్వహిస్తారు… దేవరి పూజారిగా   అచారాలు,సంప్రదాయాలు తుచా  తప్పకుండా నిర్వహిస్తారు… గిరిజనుల పండుగలలో   దేవరి   అంత్యంత కీలక పాత్ర వహించి పండుగలను  నిర్వహిస్తుండటం  విశేషం..  పెళ్లిళ్లను  సైతం   దేవరి    అధ్వర్యంలో    నిర్వహిస్తారు..‌ పెళ్లిలలో   వేద మంత్రాలు పఠించడానికి  ఇతరుల మాదిరిగా పూజారులనహ అహ్వనించరు..‌దేవరి ద్వారా  పెళ్లిలు చేయిస్తున్నారు….పెళ్లిలు  దేవరి పూజారి ద్వారా   నిర్వహించడమే కాకుండా… పెళ్లిలలో వాయించే   వాయిద్యాలు  గిరిజనులు వాయించుకుంటున్నారు..ఆ వాయిద్యాలు  సైతం ఇతరు వద్ద కోనుగోలు చేసినవి కావు..వారే స్వయంగా  తయారు  చేసుకున్నా వాయిద్యాలే…ఇలా వ్రుత్తి  ఏదైనా   అందులో  అద్బుతమైన నైపుణ్యంతో  అదివాసీలు  రాణిస్తున్నారు.. ‌అందరికి స్పూర్తిని ఇస్తున్నారు.. సకల వ్రుత్తుల పనులు   చేస్తున్నా  అదివాసీలను అందరు అభినందిస్తున్నారు..

Leave A Reply

Your email address will not be published.