ఆదివాసీ గూడాలలో విత్తనాల పండుగ

విత్తానాలకు దేవుళ్ల ఆశీస్సులు తీసుకుంటున్నా గిరిజనులు

మొకాళ్ల పై నడుస్తూ.మొక్కులు చెల్లిస్తున్నారు… సాగు సంబరానికి చిక్కులు లేకుండా చేయమని దేవతను ప్రార్థిస్తున్నారు..విత్తనాలకు పూజలు నిర్వహిస్తున్నారు… అదిదేవతల ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు.. కాసులు వర్షం కురిపించాలని అదివాసీల విత్తనాల పండుగను నిర్వహిస్తున్నారు… అదివాసీల విత్తనాల పై పండుగ పై ప్రత్యేక కథనం

. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో అదివాసీలకు విత్తనాలనే సంపదగా బావిస్తారు… బంగారం ఉన్నా లేకున్నా బాదపడరు.. , కోట్ల రుపాయలు లేవని చిత్తించరు.. పంట పోలాలే బంగారు గనులని…‌పసిడి భూముల్లో విత్తనాలు నాటితే అపారమైన. సంపద. తమకు లబిస్తుందని అదివాసీల విశ్వాసం.

. అందుకే అదివాసీలు ప్రతిఏటా విత్తనాలు పండుగ. నిర్వహిస్తారు.. అందులో బాగంగా కుమ్రంబీమ్ జిల్లా జైనూర్ మండలం దేవుని గూడంలో అదివాసీలు నాటే విత్తనాలకు పండుగ నిర్వహిస్తున్నారు.. గూడేంలో గిరిజనులు ప్రతి ఒక్కరు పండగలో దేవుళ్ల ఆశీస్సులు తీసుకుంటున్నారు …ఈ విత్తనాల పండగను వర్షకాలం ముందు మే మాసంలో నిర్వహిస్తారు.. అదివాసీలు నాటే విత్తనాలన్నింటిని వాయిద్యాల మద్య గూడేంలో ఉన్నా దేవత గుడి చేరుకుంటున్నారు… ఆ గుడిలో ఇంట్లో నుండి తీసుకవచ్చిన,పత్తి, సోయా,రాగులు ,జోన్నలు, కోర్రలు, కందులు,మినుములు ఇలా ఏ పంట నాటితే ఆ పంటకు విత్తనాలు దేవతకు వద్దకు తీసుకవెళ్లుతారు.. అక్కడే దేవత. ముందు ఉంచి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు… అదేవిధంగా దేవున్ని ప్రార్థిస్తూ రేలా పాటలు పాడుతున్నారు గిరిజన మహిళలు

విత్తనాల పండుగ. ఎళ్ల నుండి వస్తున్నా అచారమని… అదే ఆచారాన్ని పాటిస్తున్నామంటున్నారు..‌ విత్తనాల పండుగలో విత్తనాలకు పూజలు చేస్తాము… ఆ పూజలు నిర్వహించడంతో అదివాసీ దేవతలు ఆశీస్సులు లభిస్తాయి… దేవత ఆశీస్సులు లభించిన. విత్తనాలు నాటిచాలు… పసిడి వర్షం ‌కురుస్తుందని.. అదేవిధముగా దేవుని ఆశీస్సులు లభించిన. విత్తనాలకు రోగాలు రాకుండా దేవతలు పాతరేస్తాయంటున్నారు గిరిజనులు… విత్తనాల. పండుగతో పాడిపంటలు లబించి తమకు అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయంటున్నారు అదివాసీలు..

Leave A Reply

Your email address will not be published.