ఆదిలాబాద్ ను దత్తత తీసుకుంటాము.రేవంత్
అదికారంలోకి వస్తే అన్ని రంగాలలో అభివ్రుద్ది చేస్తాము

ఆదిలాబాద్
ముస్లింల. రిజర్వేషన్లు ఎత్తివేత పై రేవంత్ రెడ్డిసీఎం కేసీఅర్ ని, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ని టార్గెట్ చేశారు.అమిత్ షా ముస్లింల రిజర్వేషన్లు ఎత్తివేస్తామని ప్రకటిస్తే ఎందుకు స్పందించడం లేదని రేవంత్ ప్రశ్నించారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన రిజర్వేషన్లు తోలగిస్తే కాంగ్రెస్ ఊరుకోదన్నారు.. సీఎం కేసీఆర్ పన్నెండు శాతం రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి పెంచకుండా మోసం చేశారన్నారు..ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో నిరుద్యోగ నిరశన ర్యాలీలో రేవంత్ పాల్గోన్నారు.. కలెక్టర్ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహించారు..ఆనంతరం అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన సభలో మాట్లాడారు… సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారు..రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నా భర్తీ చేయడం లేదని ఆయనమండిపడ్డారు.. పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలతో అడుకుంటున్నారన్నారు..పేపర్ లీకేజీకి కారణమైన టీఎస్ పీఎస్సీ సభ్యులు తోలగించాలని డిమాండ్ చేశారు…అదేవిధంగా మంత్రి కేటీఅర్ కు దీనితో సంబంధం ఉందన్నారు.. సంబందం ఉన్నా మంత్రిని తోలగించాలని డిమాండ్ చేశారు.
. కాంగ్రెస్ అదికారంలోకి వస్తే రెండు లక్షల. ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు… నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు… అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామన్నారు..అన్ని రంగాలలోఅభివ్రుద్ది చేస్తామన్నారు.. గిరిజన యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు..ఆదిలాద్ ఎమ్మెల్యే జోగురామన్న నియోజకవర్గానికి ఏం చేయలేదన్నారు.. జోకుడు రామన్నగా మారారని విమర్శించారు… సీఎం కేసీఅర్ ను జోకి ఒకసారి మంత్రయ్యారు…రామన్న ఆయన కోడుకును మున్సిపల్ చైర్మన్ గా చేశాడని రేవంత్ మండిపడ్డారు. .. రాష్ట్రంలో బిజెపి, బిఅర్ ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.. పేపర్ లీకేజీ చేసిన సంజయ్ ఒకరోజు జైల్లో ఉంటే…పేపర్ లీకేజీ చేసిన వారి పై చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ నాయకులు అందోళన చేస్తే ఐదు రోజులు జైల్లో పెట్టారన్నారు..ఇదే కుమ్మక్కు నిదర్శనమన్నారు.. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రజలను కోరారు.. కాంగ్రెస్ అదికారంలోకి వస్తే ప్రజల సమస్యలను తీర్చుతామని భరోసానిచ్చారు.