సీసీఐ భూముల్లో రియల్ ఎస్టేట్ వేంచర్లు?
సీసీఐ భూములను కోల్లగోడుతున్నా రియల్ మాపియా

.. పరిశ్రమ భూములు ప్లాట్లుగామారుతున్నాయి…రియల్ ఎస్టేట్ వేంచర్లుగా మారుతున్నాయి.. ప్లాట్లను అమ్ముతూ లూటీదందాను సాగిస్తోంది రియల్ మాపియా… కోట్ల రుపాయల భూ దందాను సాగిస్తున్నా దోపిడిదారులేవరు. సిమెంట్ పరిశ్రమ భూములనుప్లాట్లుగా అమ్ముతున్నా వ్యాపారుల పై చర్యలు అదికారులు ఎందుకు జంకుతున్నారు.. సిమెంట్ పరిశ్రమ. భూముల్లో రియల్ మాపియా దోపిడీ దందాపై ప్రత్యేక కథనం
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సీసీఐ. సిమెంట్ పరిశ్రమ. ఉంది…ఈ. పరిశ్రమకు వందల కోట్ల విలువైనా భూములు ఉన్నాయి. సిమెంట్ పరిశ్రమకు కోసం కోనుగోలు చేసిన భూములు 772 ఎకరాలున్నాయి.. అదేవిధంగా లీజ్ ఒప్పందం చేసుకున్నా భూములు 1506 ఎకరాలు. ఉన్నాయి… వీటిలో అపారమైన. సిమెంట్ ఉత్పత్తి కి తోడ్పడే లైమ్ స్టోన్ నిల్వలు ఉన్నాయి. లైమ్ స్టోన్ తో సిమెంట్ కార్పొరేషన్ అప్ ఇండియా అధ్వర్యంలో పరిశ్రమ సిమెంట్ ఉత్పత్తి చేసింది.. ఇరవై సంవత్సరాల పాటు పరిశ్రమ. ఉత్పత్తి చేసింది కాని నష్టాల సాకుతో కేంద్రం పరిశ్రమను మూసివేసింది..
మూతపడిన. పరిశ్రమ. భూములు ఆదిలాబాద్ పట్టణానికి అనుకోని ఉన్నాయి… దాంతో ఈ భూములకు మార్కేట్లో బారీగా డిమాండ్ ఉంది.. ఆ డిమాండ్ ఉన్నా భూముల పై రియల్ మాపియా కన్నేసింది… ఆ భూములను రియల్ ఎస్టేట్ వేంచర్లుగా మార్చుతోంది… వెంచర్లలో ప్లాట్లను అమ్ముతూ మాపియా దందా సాగిస్తోంది… ఈ దోపిడీ దందాతో కోట్ల రుపాయలు కోల్లగోడుతోంది మాపియా..
. సిమెంట్ పరిశ్రమ. కోనుగోలు చేసిన. భూములను, అదేవిధంగా లీజ్ కు తీసుకున్నా భూములలో రియల్ మాపియా నిబంధనలకు వ్యతిరేకంగా వేంచర్లు చేస్తోంది… ఈ వెంచర్లకు మైనింగ్ అదికారుల. అనుమతి లేదు…పైగా లీజ్ భూముల. లీజ్ పోడగించాలని తెలంగాణ సర్కార్ ను సీసీఐ. అదికారులకు కోరారు.. అది ప్రభుత్వం పెండింగ్ లో ఉంది..ఈ లోపు రియల్‌మాపియా తుట్టేకి పావుసేరుకు భూములు లీజ్ రైతుల నుండి భూములను కోనుగోలు చేస్తోంది. …ఒకవేళ. రైతులు భూములు అమ్మకుంటే రైతులను భయబ్రాంతులకు గురిచేసి లాక్కుంటుందని ఆరోపణలు ఉన్నాయి… లీజ్ సీసీఐ. రద్దు చేసుకోకుండా భూములు కోనుగోలు చేయడం చెల్లదు.. లీజు భూములైనా హక్కులన్ని సీసీఐ పరిశ్రమకు ఉంటాయి..కాని ఇలాంటి నిబంధనలు పాటించకుండా.. పట్టించుకోకుండా వెంఛర్లు వేయడం పై ఆదిలాబాద్ ఎంపి సోయంబాపురావు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు..రియల్ మాపియా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు…లేదంటే సీసీఐ అదికారులకు పిర్యాదు చేసి చర్యలు తీసుకుంటామని మాపియా ఎంపి హెచ్చారించారు..
సీసీఐ. పరిశ్రమ లీజ్ భూములలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయడం వివాదస్పంగా మారింది…రెవిన్యూ అదికారులు మాపియాకు వంతపాడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి… ఈ. ఆరోపణల పై ఉన్నాతాదికారులు విచారణ చేపట్టారు.. నిబంధనలకు వ్యతిరేకంగా రియల్ ఎస్టేట్ వేంచర్ కు నాలా పర్మిషన్ ఇచ్చినట్లు తెలితే చర్యలు తప్పవంటున్నారు అర్డీఓ. రమేష్ రాథోడ్…అదేవిధంగా రియల్ మాపియా పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చారిస్తున్నారు. అర్డీఓ..