అడవుల్లో మొరం క్వారీలు ఏర్పాటు చేసుకున్నా మాపియా
అడ్డగోలుగా తవ్వకాలు చేస్తున్నా మాపియా

ఆకాశాన్ని తాకేకోండలు.. దట్టమైన అడవులు… ఆ అడవులే మొరం క్వారీలయ్యాయి.. అడవులను ద్వంసం చేశారు…కోండలను బారీ యంత్రాలతో తోడేస్తున్నారు…కోట్ల రుపాయల మొరాన్ని దోపిడి చేస్తున్నారు దోపిడీ దారులు.. అడవులను లూటీ చేస్తున్నా… కోండలను మింగేస్తున్నా దోపిడీ దందాను అరికట్టడానికి అటవీ అదికారులు ఎందుకు భయపడుతున్నారు..ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో అక్రమ మొరం క్వారీల పైప్రత్యేక కథనం
… ఆదిలాబాద్ జిల్లాలో మొరం మాపియాకు అడ్డు అదుపు లేకుండా పోయింది.. సర్కార్ భూములను, చెరువులను లూటీ చేసిన మాపియా… అడవులపై కన్నేసింది.. అడ్డగోలుగా తవ్వకాలు చేస్తొంది..జైనథ్ మండలం మేడిగూడ. గ్రామ ప్రాంతం లో దట్టమైన అడవులు ఉన్నాయి… ఎత్తైనా కోండలు ఉన్నాయి…
.. ఈ అడవులు… కోండలున్నా ప్రాంతంలో మొరం మాపియా క్వారీలు ప్రారంభించింది.. ఈ క్వారీలకు అనుమతులు లేవు.. పర్మిషన్లు లేవు. కాని అనుమతులు లేకున్నా ముప్పై ఎకరాలలో తవ్వకాలు చేస్తోంది..ఏకంగారెండు ప్రోక్లైన్లతో తవ్వకాలు చేస్తోంది.. తవ్విన మొరాన్ని యాబై టిప్పర్లలలో రాత్రి పగలు తేడా లేకుండా అక్రమంగా తరలిస్తోంది. ప్రతినిత్యం వందల టిప్పర్ల మొరాన్ని కోత్తగా వేస్తున్నా వేంచర్లకు, రోడ్లనిర్మాణానికి, ఇండ్ల కోసం తరలిస్తోంది మాపియా.. ఒక్కో టిప్పర్ కు ఐదువేల రుపాయలకు మొరాన్ని అమ్ముతూ కోట్లు కోల్లగోడుతోంది
..విచ్చలవిడిగా చేస్తున్నా మొరం తవ్వకాలతో అడవులు నామరూపాలు లేకుండా పోయాయి… ఎక్కడ చూసిన మొరం కోసం పాతళ లోకం కనిపించేలా తవ్విన గుంతలు కనిపిస్తున్నాయి… దీనితో ఆకాశం తాకే కోండలు తవ్వకాలతో కనిపించకుండా పోయాయి… మాపియా తవ్వకాలతో ఎక్కడ చూసిన. కయ్యలు కనిపిస్తున్నాయి.. ఎకంగా ఇప్పటికే ముప్పై ఎకరాలలో తవ్వకాలు చేశారు. .. అయినప్పటికీ తవ్వకాలనుఅపడం లేదు.. యథేచ్చగా మాపియా బరితెగించి తవ్వకాలు సాగిస్తోంది.
. అయితే అదివాసీబిడ్డలు అడవుల నుండి తట్టేడు మొరం తెచ్చుకోవడానికి అనుమతి ఇవ్వని అటవీ అదికారులు, … మొరం మాపియా ముప్పై ఏకరాలలో తవ్వకాలు చేస్తున్నా అటువైపు కన్నేత్తి చూడటం లేదు…మొరంమాపియా తవ్వకాలు నియంత్రణ చేయడానికి చర్యలు చేపట్టడం లేదు.అటవీ అదికారులు మొరం మాపియాతో కుమ్మక్కయ్యారని గిరిజన నాయకుడు గోడం గణేష్ అదికారుల తీరు పై మండిపడుతున్నారు..కనీసం మేకలను మేపడానికిఅనుమతించని అటవీ అదికారులు.. విచ్చలవిడిగా సాగిస్తున్నా మొరం తవ్వకాలను ఎందుకు అడ్డుకోవడంలేదని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు… . అదేవిధంగా మాపియాతోకుమ్మక్కైనా అటవీ అదికారుల పై చర్యలు చేపట్టాలని గిరిజనులు సర్కార్ ను కోరుతున్నారు