యూట్యూబ్ లో చూసి డిజెలు తయారు చేస్తున్నా అదివాసీలు
గూడేంలో డిజేల ఖార్ఖానా రెండు వేల. డిజేలు తయారీ చేసి అమ్మిన అదివాసీలు

అదివాసీ బిడ్డలు.. బహుళ జాతి కంపేనిలతో పోటీపడుతున్నారు
. డిజెల తయారీలో కంపేనిలతో డీ అంటే డీ అంటున్నా అదివాసీ బ్రాండేడ్ డిజేలు… సౌండ్ ఇంజనీర్లు కాకున్నా అద్బుతమైన డిజేలు తయారు చేస్తున్నా గిరిజన బిడ్డలు… యూ ట్యూబ్ లో చూశారు. దద్దరిల్లె సౌండ్ తో డిజేలు తయారు చేస్తున్నా గిరిజన బిడ్డలు … అదివాసీ బ్రాండేడ్ డిజేల పై ప్రత్యేక కథనం
అదివాసీలు…. ఎకలవ్యున్ని మించినా వాళ్లు.. వ్రుత్తి నైపుణ్యం లేకున్నా .. ఒకసారి చూస్తే చాలు… ఎంతటి నైపుణ్యాన్ని సాదించే సత్తా ఉందని అదిలాబాద్ జిల్లా అదివాసీ బిడ్డలు నిరూపిస్తున్నారు
.. డిజేలు తయారు చేయడమంటే మాటలు కాదు… డిజేలు తయారి చేయడంలో అహుజా, పానసోనిక్ ఇతర. బహుళ కంపేనిలు తయారు చేస్తున్నాయి… అద్బుతమైన సంగీతాలను పలికించే డిజేలను తయారు చేయడంలో ఆ కంపేనిలదే సామ్రాజ్యం..
.. ఆ. సామ్రాజ్యంలో సామాన్యులకు అసలు చోటు లేదు…కాని డిజేలను తయారు చేయడంలో గూడేం బిడ్డలు అడుగు పెట్టారు.. జామడా గూడేంకు చెందిన జయంత్ రావు, లింబారావు, రాయి సిడాం గోపాల్ , కుమ్ర అనిల్, యశ్వంత్ రావు అద్బుతమైన డిజేలు తయారు చేస్తున్నారు…మల్టీనేషన్ కంపేనిలకు సవాళ్లు విసురుతున్నారు… డిజే అర్డర్ ఇస్తే చాలు… అడిగిన రోజు. డిజేలు. తయారు చేసి ప్రజలకు అందిస్తున్నారు.. ఇప్పటి వరకు రెండు వేలకు పైగా డిజేలు తయారు చేసి అమ్మడం విశేషం..
.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాణ్యత కూడిన రకరకాల వాట్స్ లో డిజేలు తయారు చేసి అమ్ముతున్మారు….అయితే డిజేలు తయారు చేస్తున్నా వారు సౌండ్ ఇంజనీర్లు కాదు. విదేశాలలో డిజేల తయారిలో శిక్షణ పోందలేదు.. కేవలం లో యూట్యూబ్ లో కంపెనీలు డిజేలు తయారు చేస్తున్నా విధానాన్ని నేర్చుకోన్నారు… ఆ నేర్చుకున్నా విజ్నానంతో అసెంబ్లింగ్ డిజేలు తయారు చేస్తూ అందరిని అబ్బురపరుస్తున్నారు
అదివాసీ బిడ్డలు తయారు చేసిన అమ్ముతున్నా. డిజేలు నాణ్యత లో కంపేనిలను మరిపిస్తున్నాయి.. సౌండ్ సిస్టమ్ లో మ్రోతలు మ్రోగిస్తున్నాయి…పైగా కంపేనిల డిజెల కంటే అతి తక్కువ ధరలకు అమ్ముతున్నారు… జిల్లాలో పెళ్లైనా, పెరంటమైనా, వినాయక నవరాత్రుల ఉత్సవాలైనా, దుర్గమాత. శోభయాత్రలలో, అదివాసీ దండారి ఉత్సవాల వినియోగిస్తున్నా డిజేలు గిరిజనులు తయారి చేసినవి కావడం విశేషం
. గిరిజన బిడ్డలు తయారు చేస్తున్నా అసెంబుల్ డిజేలకు మార్కెట్ లో బారీగా డిమాండ్ పెరుగుతోంది… బారీగా డిజెలు తయారు చేయాలని గిరిజనులను కోరుతున్నారు.. ఎకంగా టేంట్ హౌజ్ నిర్వహకులు, ప్రైవేటు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించే వారు సైతం ఇక్కడే డిజేలు తయారు చేయిస్తున్నారు.. అదివాసీల. డిజెలతయారీకీ ఎంత డిమాండ్ ఆర్థమవుతోంది.
అయితే డిజేల. తయారి లో నైపుణ్యం ఉన్నా పెట్టుబడి మాత్రం ఈ గిరిజనులకు అంతంతమాత్రమే …. సర్కార్ సహయం అందిస్తే చాలు…డిజేలు తయారు చేయడానికి పరిశ్రమ ఏర్పాటు చేస్తామంటున్నారు…పదిమందికి ఉపాదినిస్తామంటున్నారు గిరిజన బిడ్డలు
.