ఉరితాళ్లు పట్టుకోని సర్పంచ్ ల అందోళ‌న

బిజెపి అద్వర్యంలో అందోళన చేపట్టిన సర్పంచ్ లు

ఆదిలాబాద్ పెండింగ్ నిదులు చెల్లించాలని సర్పంచ్ లు పోరాటాన్ని ఉద్రుతం చేశారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ట్రెజరీ కార్యాలయం ముందు సర్పంచ్లు నిధులు విడుదల చేయాలని ఉరి తాళ్లతో ధర్నా నిర్వహించారు .
ఈ సందర్భంగా బిజెపి పాయల్ శంకర్ మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలనలో గ్రామ పంచాయతీల పరిస్థితి గోరాతి ఘోరంగా ఉంది అన్నారు .కేంద్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి నిధులు విడుదల చేస్తే ఆ నిధులను సర్పంచులకు తెలవకుండా దొడ్డిదారిన దారిమళ్లించుకున్నారన్నారు. గ్రామపంచాయతీలకు శానిటైజేషన్ కార్మికులకు పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందన్నారు. నీటి పన్ను రూపంలో ఇంటి పన్ను రూపంలో ఆస్తిపన్ను రూపంలో చేస్తున్న పన్ను వస్తువులను ట్రెజరీ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంటుంది కానీ పంచాయతీల కనీస అవసరాలకు కావలసిన నిధులను కూడా ఇవ్వట్లేదని అన్నారు సర్పంచులు సొంత డబ్బుతో పనులు చేయించి కార్మికులకు జీతభత్యాలు ఇచ్చి పంచాయతీని నడిపిస్తున్నారు .సకాలంలో వారికి నిధులు అందక పదుల సంఖ్యలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు .మిగతా సర్పంచులు కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు రాష్ట్రంలో మంత్రులు నాయకులు నెల నెల లక్షల్లో జీతభత్యాలు తీసుకుంటున్నారు. కానీ చిరు ఉద్యోగులు చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు మాత్రం మూడు నెలలకు ఆరు నెలలకు పూర్తి జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని అన్నారు ఇందుకేనా తెలంగాణ సాధించుకున్నది ఎందుకైనా కేసీఆర్ ను సీఎం చేసింది అని ఆయన ధ్వజమెత్తారు ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న స్పందించి నిదులు విడుదల చేయించాలని డిమాండ్ చేశారు

Leave A Reply

Your email address will not be published.