ఆదిలాబాద్ లో ‌ అడపిల్లల అమ్మకం

పిల్లలను పెంచలేనంటూ ఇద్దర ఆడపిల్లలను కర్నాటకకు అమ్మిన తండ్రి

. అంగట్లో‌‌‌అడ పిల్లల అమ్మకం.. సంత సరుకులా అడ పిల్లల‌అమ్మకం… ఆర్ ఎం పి డాక్టర్ బ్రోకర్ గా మారాడు…
ఆదిలాబాద్ నుండి అడ పిల్లలను కర్నాటకకు‌ పిల్లలను అమ్మేశారు… కంటి రేప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి కన్న కూతుళ్లను ఏందుకు అమ్మేశాడు… కూతుళ్లను అమ్మి‌న డబ్బులతో కోత్త వాహనాన్ని కోనుగోలు చేసిన కిరాతక తండ్రి.. ఆదిలాబాద్ జిల్లాలో పిల్లల అమ్మకాల. ‌ముఠా వెనుక ఉన్నదేవరు… పసిపిల్లల. అమ్మకాలను సాగిస్తున్నా దేవరు?ఆదిలాబాద్ జిల్లాలో పసిపిల్లల అమ్మకాల దందా పై ప్రత్యేక కథనం

. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో పిల్లల అమ్మకాల. గుట్టురట్టైంది… బంగారు గూడా కాలని చెందిన ఒకటినర సంవత్సరం వయస్సు ఉన్నా ఇద్దరు అడపిల్లలను కర్నాటకు‌ అమ్మేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది…ఈ. అమ్మకాలలో‌‌ పాత్ర ఉన్నా పన్నేండు మంది పై పోలీసులు కేసు నమోదు చేశారు.. తోమ్మిదిని మందిని పోలీసులు అరెస్టు చేశారు

బంగారగూడకు చెందిన. గంగాదర్ , రాదమ్మ దంపతులకు కవల పిల్లలు జన్మించారు… ‌ పిల్లలు జన్మించిన. కోద్ది రోజులకే తల్లి ప్రాణాలు కోల్పోయింది..అప్పటికే గంగాదర్ కు ముగ్గురు అడ పిల్లలు ఉన్నారు.మళ్లీ ఇద్దరు అడ పిల్లలు పుట్టడం.. అదేవిధంగా పిల్లలను పోషించడం కష్టంగా ‌మారింది తండ్రికి

పిల్లల పోషణ బారంతో ఇబ్బందులు పడుతున్నా గంగా దర్ పై అక్కడే ఉన్నా పిల్లలను అమ్మకాలను చేసే ముఠా గంగాదర్ పై వల విసిరింది.
.‌అందులో బాగంగా షారూక్ , గంగాదర్ తో‌ అమ్మకాల పై సంప్రదింపులు జరిపారు. ఆ సంప్రదింపులకు గంగాదర్ సానుకూలంగా స్పందించారు.అమ్మడానికి ఓప్పుకున్నారు. అమ్మకాలకు గంగాదర్ సిద్దంగా ఉన్నాడని అమ్మకాల. చేసే ముఠాలో కీలకమైన సభ్యుడు అర్ ఎంపి డాక్టర్ జగన్నాథ్ కు షారూక్ ద్వారా సమాచారం చేరింది.

.. అయితే అర్ ఎంపి డాక్టర్ జగన్నాథ్ కర్ణాటక చెందిన వ్యక్తి… ఇక్కడే గతకోన్ని అర్ ఎం పి డాక్టర్ గా పనిచేస్తున్నారు… అడ పిల్లలు‌అమ్మడానికి సిద్దంగా ఉన్నార‌ని అర్ ఎంపి డాక్టర్ కర్నాటకలో ఉన్నా అక్క సమాచారం అందించారు‌..అక్కడ. సంతానం లేని లేక పిల్లలు లేక కోనడానికి సిద్దంగా ఉన్నా తల్లిదండ్రులతో బేరం కుదుర్చుకున్నారు.బేరం సందర్భంగా తల్లిదండ్రులతో జగన్నాథ్ పోన్ లో మాట్లాడారు..ఓప్పందం చేసుకున్నారు.. ఒక పాపకు మూడు లక్షల రుపాయలు,మరోక పాపకు రెండు లక్షల యాబై వేలకు బేరాన్ని కుదుర్చుకున్నారు.

ఓప్పందం కుదరడంతో గంగాదర్ ఇద్దరు పిల్లలను తీసుకోని బ్రోకర్ అర్ ఎంపి డాక్టర్, గంగాదర్ అక్క, అత్తమ్మ,షారుక్ కర్నాటకు వెళ్లారు..కర్నాటకలొని కుంటకార్వ గ్రామంలో రమ,కొమల్ పెద్ద కూతురును రెండు‌లక్షల‌ యాబై‌వేలకు అమ్మేశారు.. ఆ తర్వాత అదే గ్రామంలో‌ ఊరి బయట చిన్న కూతురు ను రాజ్ కుమార్ కు మూడు లక్షలు రుపాయలకు అమ్మేశారు..డబ్బులు తీసుకోని ఆ తర్వాత. అదిలాబాద్ వచ్చారు‌ .. పిల్లలను అమ్మిన‌డబ్బులను వాటాలుగా పంచుకున్నారు.తండ్రి కి ఒక్కో పాపకు, లక్ష యాబైవేలు,మూడు లక్షలు తీసుకున్నారు..తీసుకున్నా డబ్బులతో వాహనం కోనుగోలు చేశారు.మిగితా డబ్బులను అర్ ఎంపి డాక్టర్, షారుక్, గంగాదర్ అత్తమ్మ,అక్క పంచుకున్నారని పోలీసుల విచారణలో తెలింది.

అయితే పిల్లలను అమ్మిన విషయం ఐసిడిఎస్ అదికారుల ద్వారా బయటపడింది…చిన్న పిల్లలకు ప్రతి‌నెల నెల పోషహకా‌రం‌ అందిస్తారు… కాని మూడు నాలుగు నెలల‌నుండి పిల్లలు‌ కనిపించలేదు.. దాంతో పోలీసులకు ఐసిడిఎస్ అదికారులు సమాచారం అందించారు… ఆ‌సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు.. దాంతో అసలు విషయం బయట పడింది…‌అదిలాబాద్ రూరల్ పోలీసులు కర్నాటక వెళ్లి విచారణ చేపట్టారు.. విచారణలో అమ్మకాలు జరిగిందని తెలింది… అమ్మిన పిల్లలను, అదేవిధంగా కొనుగోలు చేసిన తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకోని ఆదిలాబాద్ తీసుకోని వచ్చారు… అక్రమంగా పిల్లలను కోనుగోలు చేసి తల్లిదండ్రులను , వారిని పై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.. పిల్లలను సంరక్షణ. కోసం ఐసిడిఎస్ పిల్లల సంరక్షణ కేంద్రానికి పోలీసులు తరలించారు

..పిల్లలను కోనుగోలు చేసిన తల్లిదండ్రులు తీవ్రంగా విలపిస్తున్నారు…బ్రోకర్లు మోసం చేశారని అవేదన వ్యక్తం చేస్తున్నారు… పేగు బందం లేకపోయి …ప్రేమానుబందం‌ఉందంటున్నారు..పిల్లలను ఇవ్వపోకతే చచ్చిపోతామని అంటున్నారు… న్యాయం చేయాలని వేడుకుంటున్నారు

Leave A Reply

Your email address will not be published.