16న ఆదిలాబాద్ లో రాష్ట్ర జీపుజాత ప్రారంభ సభ

ఆదిలాబాద్: నూతన విద్యా విధానం పేరుతోనీ అంగన్వాడీలను మూసివేసే ప్రయత్నాలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు.తెలంగాణ అంగన్వాడి టీచర్స్& హెల్పర్ యూనియన్ రాష్ట్ర కమిటీ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర జీపు జాత చేపట్టానున్నారు. ఈ జాత జిల్లా కేంద్రంలో జూన్ 16న స్థానిక ఆర్ &బి మైదానం లో జాత ప్రారంభ సభ జరుగును ఈ సభను జయప్రదం చేయాలనీ ప్రచారంలో భాగంగా తలమడుగు మండలంలోని జీపుజాత వాల్పోస్టర్లను విడుదల చేయడం జరిగింది.ఈకార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నాయి అన్నారు.