సహాయం కోసం ఎదురు చూపులు

మంచిర్యాల‌: రెబ్బెన మండలం దుర్గాపుర్ గ్రామంలోని ఓ నిరు పేద కుటుంబానికి అనుకోని ఆపద వచ్చింది.నానవెని రవి,సౌజన్య దంపతులకు ఇద్దరు సంతానం పెద్ద కుమార్తె రిషిత గత కొంతకాలంగా ఫ్యాంకొని అనీమియా వ్యాధితో బాధపడుతుంది,ఈవ్యాధికి గురైన పాప శరీరంలో ఎదుగుదల లేక రక్తహీనతతో మరింత బాధ పడుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత ఐదు సంవత్సరాల నుంచి ఎన్ని ఆసుపత్రులు తిరిగినా పాప ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాకపోవడంతో చివరికి హైదరాబాదులోని యశోద హాస్పిటల్ తీసుకువెళ్లగా పాపను పరీక్షించిన డాక్టర్లు చికిత్సకు దాదాపు 20 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారని,కుటుంబ సభ్యులు తెలిపారు.అసలే రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉన్నా తాము ఇంత ఖర్చు ఎలా భరించగలం అని పాప తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేయగలరని పాప తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.దాతలు సహాయం అందించాల్సిన ఫోన్ నెంబర్ నాన వేణి రవి.8790372570 ఫోన్ పే.

Leave A Reply

Your email address will not be published.