బీటెక్ లో ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం.

మంథని జేఎన్ టియుహెచ్ లో రిజర్వేషన్ కోటాలో బిటెక్ లో ప్రవేశం కోసం సింగరేణి ఉద్యోగుల పిల్లల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురువారం బెల్లంపల్లి ఏరియా జిఎం జి.దేవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.ఎక్సుక్యుటివ్ పిల్లలకు 18 సీట్లు,ఎన్ సిడబ్ల్యూఏ (ఉద్యోగుల) పిల్లలకు 18సీట్లు కేటాయించినట్లు తెలిపారు.ఎంసెట్ క్యాలిఫై ఐన విద్యార్థులు ఎంసెట్ ర్యాంక్ కార్డ్,ఉద్యోగి ఒరిజినల్ కంపని గుర్తింపు కార్డు,కులం సర్టిఫికేట్,లోకల్,నాన్ లోకల్ సర్టిఫికేట్ తో జూలై 10లోగా గోలేటిలోని జిఎం కార్యాలయం పర్సనల్ విభాగంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.వీటితో పాటు యూనివర్సిటి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్(కాకతీయ యూనివర్సిటీ)కొత్తగూడెం కళాశాలలో బిటెక్ మైనింగ్ కోర్సులో 2 సీట్లు,సిఎస్ఈ లో 2 సీట్లు,ఐటి లో 2 సీట్లు,ఈఈఈ లో 2 సీట్లు, ఈసీఈ లో 2 సీట్ల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.