ప్లాస్టిక్ తో ప్రాణాలకే ముప్పు: అబ్దుల్ ఖదీర్

మంచిర్యాలః ప్లాస్టిక్ తో ప్రాణాలకే ముప్పు అని అబ్దుల్ ఖదీర్ అన్నారు.మంగళవారం ఆర్ కే ఇంక్లైన్ లో స్వచ్ఛత పక్వడా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా గని ప్రాంగణం లో ప్లాస్టిక్ , చెత్త ను తొలగించారు.గని మేనేజర్ అబ్దుల్ ఖదీర్ మాట్లాడుతూ..గనిలో ప్లాస్టిక్ వాడవద్దని, అది పర్యావరణానికి ముప్పు అని ఆయన అన్నారు. ప్లాస్టిక్ను నిత్యజీవితంలో అతిగా ఉపయోగించడం వలనపర్యావరణానికికే కాకుండా, భవిష్యత్తులో మానవకోటికి, జీవరాశులకు ఈవిడ నష్టం కలుగుతుందన్నారు.భూమి,నీరు,గాలి, కలుషితం కావడం మూలాన జీవరాశులన్నీ అనారోగ్యాల బారిన పడుతాయన్నారు. ప్లాస్టిక్ నియంతన ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ రాంచందర్ సంక్షేమ అధికారి రణదీప్,రక్షణ అధికారి శివయ్య ఇంజనీర్ సందీప్, రమేష్, రాజు,విజయ్, షిఫ్ట్ అధికారులు, యూనియన్ నాయకులు,కార్మికులు తదితరులు పాల్గొన్నారు ..