ప్ర‌జా సంక్షేమం ప‌ట్ట‌ని ఎమ్మెల్యే జోగు రామ‌న్న

కాంగ్రెస్ రాష్ట్ర నాయ‌కులు కంది శ్రీ‌నివాస‌రెడ్డి

ఆదిలాబాద్ః ప‌ది హేనేళ్లుగా ప్ర‌జా సంక్షేమాన్ని విస్మ‌రించిన జోగు రామ‌న్న ఒక అస‌మ‌ర్థ ఎమ్మెల్యే అని కాంగ్రెస్ రాష్ట్ర నాయ‌కులు కంది శ్రీ‌నివాస‌రెడ్డి ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కాంగ్రెస్‌…ఇంటింటికీ కంది శ్రీ‌న‌న్న నినాదంతో జైన‌థ్ మండ‌లంలో ఆయ‌న విస్తృతంగా ప‌ర్య‌టించారు. మండ‌లంలోని ఆనంద్‌పూర్‌, కూర‌, క‌రంజి గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ డిక్ల‌రేష‌న్‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. ప్ర‌తీ గ్రామంలో ఆయ‌న‌కు నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గడప గడప తిరిగి కాంగ్రెస్ గ్యారంటీ హామీలపై వివ‌రించారు. ఇంటింటికి కరపత్రాలు పంచుతూ స్టిక్కర్లు అతికించారు. ఈ సంద‌ర్భంగా కంది శ్రీ‌నివాస‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్ర‌భుత్వం, స్థానిక ఎమ్మెల్యే జోగు రామ‌న్న ప‌నితీరుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. జోగురామ‌న్న ఎన్ని ఇండ్లు క‌ట్టించాడ‌ని ప్ర‌శ్నించారు. ల‌క్ష రూపాయ‌ల రుణ‌మాఫీ ఎంత‌మందికి వ‌చ్చింద‌ని అడిగారు. ఒక్క కొత్త‌రేష‌న్ కార్డు, ద‌ళితుల‌కు మూడు ఎక‌రాల భూమి, అర్హులైన వారంద‌రికీ పింఛ‌న్, స్కాల‌ర్షిప్ లాంటి ఏ ఒక్క హామీ నెర‌వేర‌లేద‌ని మండిప‌డ్దారు. ఆదిలాబాద్ కు ప‌ట్టిన శ‌నిగ్ర‌హాలు జోగురామ‌న్న, పాయ‌ల్ శంక‌ర్ అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వ్యాపారుల‌ను ముంచి పాయ‌ల్ శంక‌ర్ పైకొస్తే, దౌర్జ‌న్యాలు, అవినీతి, అక్ర‌మాలు చేసి జోగు రామ‌న్న ఎదిగాడ‌ని ఆరోపించారు. వీరు ఇద్ద‌రూ తోడు దొంగ‌లేన‌ని ధ్వ‌జ‌మెత్తారు. జోగు రామ‌న్న‌ను ఓడించాల‌నుకునేటోళ్లు త‌న‌తో చేయి క‌లిపి కాంగ్రెస్‌కు ఓటేయ్యాల‌న్నారు. ఆయ‌న ఇన్నాళ్లు చేసిన అన్యాయాలు, అక్ర‌మాల‌ను బొంద పెట్టాల‌న్నారు. జోగు రామ‌న్న‌కు నాలుగుసార్లు అవ‌కాశ‌మిచ్చార‌ని, ఈసారి కాంగ్రెస్‌కు చాన్స్ ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో గిమ్మ సంతోష్, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ ష‌కీల్ ,అల్లూరి అశోక్ రెడ్డి, ఎంపీటీసీ మనోజ్, వసీమ్ రంజాని, గోలి వెంకటి,షేక్ సలీం, సామ రాజారెడ్డి, దిగంబర్ రెడ్డి, మామిడి మల్లారెడ్డి, షేక్ హ‌మీద్, తిప్పరెడ్డి భూమన్న, కంచర్ల పోతన్న,సామా భూమారెడ్డి, వెంకట్, పెంద్రే దిలీప్సంతోష్ రెడ్డి, కిష్టా రెడ్డి, పుండ్రు రవి కిరణ్ రెడ్డి, సంజీవ్, బండి కిష్టాన్న,మాజీ కౌన్సిలర్ ప్రభాకర్, అస్బాత్ ఖాన్,లింగన్న, ఎల్మా రామ్ రెడ్డి, గేడం అశోక్, మానే శంకర్, పొచ్చన్న, పోతారాజు సంతోష్,నందు,షేక్ షాహిద్,విశాల్ శర్మ, రామ్ రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.