ఇచ్చిన హామీలను విస్మరించిన బి.ఆర్.ఎస్.ప్రభుత్వం

టిపిసిసి ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత

ఆదిలాబాద్: ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు,టిపిసిసి ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత అన్నారు.ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా జైనథ్ మండలంలోని కరంజి గ్రామంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి తో పాటు పార్టీ శ్రేణులతో కలిసి ఆమె మంగళవారం పర్యటించారు.ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాలతో పాటు రైతు డిక్లరేషన్,యూత్ డిక్లరేషన్ వివరాలను ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ అర్హులైన వారికి పెన్షన్లు,రేషన్ కార్డులు,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇలా సంక్షేమ అమలు అందక ప్రజలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలంలో రైతు రుణమాఫీ తో పాటు రైతుబంధు,అదే విధంగా రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు.ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడతామని అన్నారు.అదేవిధంగా 500 రూపాయలకే వంటగ్యాలు సిలిండర్ అందించడం జరుగుతుందని హామీ ఇచ్చారు.అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన వారందరికీ 4000 రూపాయలు పెన్షన్ ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షుడు అంబకంటి అశోక్,ఎల్టి జగదీశ్ రెడ్డి,జైనథ్ మండలం ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు గంగన్న,రాము, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి,కన్య ప్రభాకర్ రెడ్డి,టౌన్ ప్రెసిడెంట్ నగేష్,మాజీ టౌన్ ప్రెసిడెంట్ వాసిమ్,వినోద్, నాందేవ్,లింగారెడ్డి,రామ్ రెడ్డి, కవిత,గంగమ్మ, రసం కిష్టు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.