ఆదిలాబాద్ జిల్లాలో మెరిసిన విద్యా కుసుమం…

ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజక వర్గ పరిధిలోని నేరడి గొండ మండలం లోని రాజురా గ్రామానికి చెందిన బానోత్ కర్ణా పార్వతి దంపతుల కుమార్తె బానోత్ తరణి తేజ దేశ వ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షలో 720 మార్కులకు గాను 538 మార్కులు సాధించి ఆదిలాబాద్ జిల్లా కు కీర్తిని సంపాదించి పెట్టింది.ఈమె తల్లి దండ్రులు..తండ్రి శ్రీ బానోత్ కర్ణా నాయక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ గా సింగరేణి కాలరీస్ లో ఫారెస్త్రీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తుండగా,తల్లి శ్రీమతి పార్వతి. డైరెక్టర్ సెరికల్చర్ ఆదిలాబాద్ గా ఉద్యోగం లో ఉన్నారు.రాజధాని హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కళాశాల లో ఇంటర్ చదివిన తరణి తేజ గట్టి పట్టుదలతో అహర్నిశలు కష్టపడి నీట్ లో జాతీయ స్థాయిలో 443 ర్యాంక్ సాధించి ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో సీట్ సంపాదించుకుంది..ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….తన తల్లి దండ్రులు మనం ఎంత అభివృద్ధి సాధిందిచినా సమాజం కోసం పాటుపడే వృత్తే మనల్ని మన తరాలు గుర్తుంచుకునేలా చేస్తుందని,అంబేద్కర్ గురించి,వివేకానంద స్వామి గురించి,మహాత్మా గాంధీజీ గురించి చిన్నప్పటి నుండి చెప్పేవారని…ఇంకా మన ఆదిలాబాద్ జిల్లా లో రక్త హీనత తో మృత్యువాత పడుతున్న మహిళల గురించి చిన్నప్పటి నుండి ఆలోచించే దాన్ని అని అలాంటి రక్త హీనత తదితర వ్యాధుల వల్ల బాధపడుతున్న మహిళలకు భవిష్యత్తులో అండగా నిలవాలనేదే నా లక్ష్యం అని ఆమె అన్నారు.

Leave A Reply

Your email address will not be published.