అడవిలో అదివాసీ బిడ్డల. ఆకలి కేకలు
వేదురు బోంగు లేక. తోటి,కోలాములకు కరువైనా ఉపాది ఎనిమీయా, సికిల్ సేల్ ఎనిమీయాతో బాధపడుతున్నా గిరిజనులు

ఆకలికి అన్నమై…నీడనిచ్చే గూడై… జీవంతో ప్రాణమై… అండగా నిలిచే తల్లే అడవే.. అదివాసీ బిడ్డలకు తల్లి.. కాని తల్లిలాంటి అడవులు అంతరించిపోతున్నాయి…. అడవులు అంతరించడంతో అదివాసీలు ఆకలితో అలమటిస్తున్నారు.. తినడానికి తిండిలేక… రోగానికి మందులు లేక. అడవి బిడ్డలు అసువులు బాస్తున్నారు.. అంతరించే దశకు చేరుకుంటున్నారు తోటి , కోలాం తేగలు… కోలాం,తోటి తేగలు మనుగడ ఎందుకు ప్రశ్నార్థకంగా మారుతోంది.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రమాదకరమైన స్థాయికి చేరిన. తోటి, కోలాం జాతుల పై ప్రత్యేక కథనం
. ఉమ్మడి ఆదిలాబాద్ గిరిజనుల మనుగడ ప్రమాదకరమైన స్థితికి చేరింది.. కోలాం, తోటి తేగలు… అదివాసీలలో రెండు తేగలలో కోలాం : ముఖ్యమైన తేగలు…ఈ. తెగలకు సంబంధించిన జనాబా రోజురోజుకు పడిపోవడం అందోళన కల్గిస్తోంది .2011 జనాబా లేక్కల కోలాం జనాబా 43554 జనాభా ఉండగా, తోటీలు తెగలకు చెందినవారు. కేవలం 3133 మంది మాత్రమే ఉన్నారు.. ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ బారీగా ఉండే ఈ రెండు తేగల జనాబా క్రమక్రమంగా తగ్గిపోతుంది…తగ్గడమే కాదు. అంతరించి పోతున్నా రు.. అందుకే కేంద్రం ప్రభుత్వం అంతరించిపోతున్నా.. మానవ మనుగడ. ప్రమాదకరమైన జాబితాలో చేరిన. గిరిజన జాతులలో కోలాం, తోటీలను పీవీటీజీలుగా గుర్తించింది..ఆ జాతులను పరిరక్షించడానికి చర్యలు చేపడుతోంది
… కోలాం, తోటీ తేగలు ఎళ్లుగా అడవి తల్లిని నమ్ముకోని జీవనం సాగిస్తున్నారు …అటవీ ఉత్తత్పుల పై అదారపడి జీవనం స సాగిస్తున్నారు… ప్రదానంగా తోటి ,కోలాం తెగలకు అడవిలో లభించే వేదురు బోంగు వాళ్లకు ఆదారం… ఆ వేదురు బోంగ్గుతో తడకలు అల్లడం, గుల్లలు, వ్యవసాయ. పనిముట్లు తయారు చేస్తారు..వాటిని అమ్ముకోని జీవనం సాగిస్తున్నారు.. వేదురు ముట్లు తయారు చేయడంలో తోటి, కోలాం మించిన వారుండరు… అయితే అడవులు అంతరించడంతో అదివాసీల బ్రతుకు చిత్రం చిన్నాబిన్నమైంది… అడవిలో వేదురు బోంగు లభించడంలేదు..ఒకవేళ లబించినా నెలలో పదిహేను రోజుల వరకు పనిలబించేలా వేదురు లభిస్తోంది.. మిగితా పదిహేను రోజులు పనులు లభించక పస్తులుఉంటున్నారు.. కోందరు పనిలేక. గూడేం వదులుతున్నారు…పనుల కోసం వెళ్లి బాహ్య ప్రపంచంలో బ్రతకలేక ప్రాణాలు కోల్పోతున్నారు…అడ్డ గుట్ట. కోలాం గూడలో ఒకప్పుడు ఆరవై కుటుంబాలు. ఉండేవి ఇప్పుడు కేవలం పద్దెనిమిది కుటుంబాలు మాత్రమే ఉన్నాయని కోలాం జిల్లా మాజీ అధ్యక్షుడు సోనేరావు.. వాపోయారు … … అదేవిధంగా పనిలేక. ఉన్నచోట. ఆకలితో అలమటిస్తూ గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారని అందోళన వ్యక్తం చేస్తున్నారు
మాత్రుత్వం ఓ కల… ఆ. కల సాకారం కోసం…మహిళలలుకోటి నోములు నోస్తారు… అలాంటి మాత్రుత్వం అదివాసీ తల్లులకు కడుపు కోతను మిగిలిస్తోంది.. పోషకాహరం లోపంతో తల్లులు రక్తహీనత తో బాదపడుతున్నారు… ఆ రక్తహీనత రాకాసిగా మారుతోంది..పురింట్లోనే తల్లులు పుట్టిన పిల్లల. మోహంచూడకుండానే రక్తహీనత, సికిల్ సెల్ ఎనిమోయా తో తల్లులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకవేళ అద్రుష్టం బాగుండి… తల్లి పిల్ల క్షేమంగా ఉంటే తల్లికి పోషకాహార లోపం వల్ల. పాల కోరత ఏర్పడుతోంది… ప్రపంచంలో ఎక్కడలేనివిదంగా అదివాసీ తల్లులు కడుపున పుట్టిన బిడ్డకు అకలి తీర్చేలా పాలను ఇవ్వలేక. తల్లడిల్లుతున్నారు..పాల
కోరత పిల్లలు ఎదగలేకపోతున్నారని తల్లులు అవేదన వ్యక్తం చేస్తున్నారు
. అదివాసీ పిల్లలు…పదేళ్లా వయస్సు వచ్చిన. పసివాడే…. ఎదుగుదల లేదు..పెరుగుదల లేదు..తీవ్రమైన పోషహర లోపంతో బాదపడుతున్నారు… లోపంతో పిల్లల శరీరాక్రుతి ఎముకల గూడును తలపిస్తోంది.. మారుమూల ప్రాంతంలో ఉన్నా తమకు సర్కారు అందించే పోషకాహరంఅందడం లేదని వాపోతున్నారు గిరిజనులు… అందువల్లనే పిల్లలు పోషకాహర లోపంతో పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు…తమ పిల్లల ప్రాణాలు పోతున్నా పట్టించుకునే వాళ్లు లేరని… కనీసం పోషకాహారం అందించే అంగడి వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అదికారులు పట్టించుకోవడం లేదంటున్నారు గిరిజనులు
. తోటి , కోలాం తేగలలో రక్తహీనత, సికిల్ సెల్ ఎనిమయా ఉందని వైద్యాదికారులు అంటున్నారు…రక్తహీనత లోపం వల్లనే గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారని డాక్టర్లు అంటున్నారు… రక్త హీనత, సికిల్ సెల్ ఎనిమీయా లోపం నివారణకు చర్యలు చేపడుతున్నామంటున్నారు డిప్యూటీ డీఎంహెచ్ ఓ మనోహర్..అందులో బాగంగా గిరిజనులందరికి గిరి వికాసం క్రింద పోషకాహరం పంపిణీ చేస్తామంటున్నారుఅదికారులు… పోషకాహార పంపిణీ తో మరణాల నివారణకు చర్యలు చేపడుతున్నామంటున్నారు
. ఒకవైపు గిరిజనులను ప్రాణాలు కాపాడటానికి చర్యలు చేపడుతున్నారు… మరోవైపు తోటి, కోలాం తెగలు నివసిస్తున్నా గూడాల. సమగ్రమైన అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు… అందులో బాగంగా రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నారు.. రవాణా సౌకర్యం మేరుగుపరచడం వల్ల. వైద్యం సకాలంలో వైద్యం అందంచడానికి దోహదపడుతుంది… చేపట్టిన. చర్యల వల్ల మరణాల రేటు తగ్గుతుందంటున్నారు ఐటిడిఎ పీఓ వరుణ్ రెడ్డి.. రవాణ సౌకర్యాలు కల్పించడంతో పాటు కోలాం ,తోటి గిరిజనులు నివసించడానికి ఇండ్లను నిర్మిస్తున్నారు.. అదేవిధంగా బడిఈడు పిల్లలకు చదువు అందించడానికి ప్రత్యేకంగా చర్యలు చెపడుతామంటున్నారు..దిశ పథకంలో బాగంగా పాఠశాలలో వసతులు కల్పిస్తున్నారు…మేరుగైనా విద్యను అందిస్తామంటున్నారు.. పోషకాహారం లోపం నివారించడం వల్ల. మరణాల రేటు తగ్గిందంటున్నారు… దీనివల్ల తోటి ,కోలాం జనాబా స్థిరంగా ఉందని.. అదివాసీల ప్రాణాలు రక్షించడానికి అన్ని చర్యలు చెపడుతున్నామన్నారు పీఈ. …గిరిజనుల అందోళన చెందాల్సిన అవసరంలేదని భరోసానిస్తున్నారు