అడవిని మింగేస్తున్నా స్మగ్లర్లు

ఆదిలాబాద్ జిల్లాలో కలప దందా అడ్డగోలుగా సాగుతోంది. సిరికొండ మండలం గోపాల్ పూర్ అడవులలో బారీగా కలప నరికివేత జరిగింది…ఆ ప్రాంతంలో కోతకు గురైనా టేకు మొదల్లు కనిపిస్తున్నాయి… గతకోన్ని రోజులుగా స్మగ్లర్లు బరితెగించి లక్షల విలువైనా కలపను నరికివేస్తూ ఇతర ప్రాంతాలకు తరలించారని స్థానికులు ఆరోపిస్తున్నారు….అయినప్పటికీ కూడ అటవీ అదికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు అటవీ అదికారుల తీరు పై మండిపడుతున్నారు.. ఈ దందాలో అటవీ అదికారుల పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి .దీని పై సమగ్రమైన విచారణ జరిపి బాద్యుల పై చర్యలు చేపట్టాలని ప్రజలు ఉన్నాతాదికారులను కోరుతున్నారు