అగ్రకుల పార్టీలను ఢీ కొట్టేది ఏకైక పార్టీ ధర్మ సమాజ్ పార్టీ

పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్

ఆదిలాబాద్ అగ్రకుల పార్టీలను డి కొట్టేది ఏకైక పార్టీ ధర్మ సమాజ్ పార్టీ అని పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ సవాల్ విసిరారు. దేశంలోనే ఎక్కడ లేనటువంటి ఎక్కడ చేయలేనటువంటి విధంగా పదివేల కిలోమీటర్ల పాదయాత్రను ఎండనకా వాననకా పూర్తి చేసుకొని అదిలాబాద్ జిల్లా మొదటి ధర్మ సమాజ పార్టీ ఆవిర్భావ సభను పార్టీ జిల్లా అధ్యక్షులు అగ్గిమల్ల గణేష్ మహారాజ్ అధ్యక్షతన ఈ సభను నిర్వహించారు. ముందుగా జిల్లా కేంద్రంలో 1000 బైకులతో ర్యాలీ నిర్వహించి అనంతరం నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు గణేష్ మహారాజ్ మాట్లాడుతూ రాష్ట్రం లోనే మొట్టమొదట ఎమ్మెల్యే అభ్యర్థిని నన్ను డాక్టర్ విశారదన్ మహారాజ్ బలపరచడం నాకెంతో సంతోషంగా ఉందని అన్నారు.అగ్ర కుల పార్టీలు మెడల పంచాలంటే మన డిఎస్పి పార్టీ వాళ్ల పంపుతున్నాను అన్నారు. ధర్మ సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహరాజ్ మాట్లాడుతూ రెడ్ల కింద దొరాల కింద బానిసలుగా బ్రతుకుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల కోసమే ఈ ధర్మ సమాజ పార్టీ పెట్టడం జరిగిందని ఇందులో అగ్రకులాల్లో అణచివేతకు గురవుతున్న వాళ్లు కూడా ఈ పార్టీ వాళ్లకు కూడా న్యాయం చేస్తుందని అన్నారు. సమాజంలో మహిళలపై నిరుపేద ప్రజలపై అహంకార అధికారాన్ని చూపుతున్న కొన్ని పార్టీలను గద్దె దించి మన పార్టీని కూర్చోబెట్టాలని కోరారు. అందరి పార్టీలకు మేనిఫెస్టో ఉంటుంది మన పార్టీకి మేనిఫెస్టో రాజ్యాంగమే అని పేర్కొన్నారు. మా రాష్ట్రంలో ఉన్న బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు అగ్రవర్ణ కులాల మనిషిని తప్ప ఎస్సీ ఎస్టీ బీసీని ఎప్పటికీ సీఎం పదవిపై కూర్చోబెట్టదని ఈ సభ చెప్తున్నాం డీఎస్పీ గెలిస్తే సీఎం పదవి బహుజనులదేనని వాళ్లు మాతీరు డిక్లేర్ చేస్తారని సవాల్ విసిరారు. అదిలాబాద్ నియోజకవర్గానికి ఒక దళిత జాతి ముద్దుబిడ్డను ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను బలపరచాలంటే ఆయన సామర్థ్యం ఆయన చేస్తున్న కార్యక్రమాలు ప్రజల కోసం కష్టపడే తత్వం ఎప్పటికీ ప్రజా శ్రేయస్సు కోరే ఇలాంటి వాళ్లు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉంటే మనం చూస్తున్నం నిరుపేద ప్రజల కష్టాలు తెలుసు కాబట్టే రానున్న రోజుల్లో కష్టాలు ఉండకుండా చేయాలంటే ఎమ్మెల్యేగా గణేష్ మహరాజ్ ను గెలిపించాలని కోరారు. ఉద్యమాలు చేసి ఒక దోర నుంచి ఇంకొక దోరకే రాజ్యాన్ని అప్పజెప్తున్నాం కాబట్టే ఈరోజు ఇంత దహనీయమైన పరిస్థితులలో ఉన్నామని మనమే రాజ్యాన్ని వెళితే మనకు ఎలాంటి పథకాలు కావాలో మన పిల్లలకు విద్యను ఉచితంగా వైద్యాన్ని ఉచితంగా పై చదువులకు స్కాలర్షిప్ లో ఇస్తూ అనేక సంక్షేమ పథకాలు మనమే పెట్టుకుని అభివృద్ధి చెందుతామని దీని గురించి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ లు ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి రాష్ట్ర నాయకులు లక్ష్మణ్ జిల్లా నాయకురాలు మంజూష జిల్లా నాయకులు వెంకటేష్ సంతోష్, రంచెందర్, గంగన్న,నవీన్, సురేష్, నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు జిల్లా నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.